గవర్నర్‌ను అడ్డుకున్న విద్యార్థులు: ‘బీజేపీ కార్యకర్త జగదీప్’గో బ్యాక్ అంటూ నినాదాలు

  • Publish Date - December 24, 2019 / 05:55 AM IST

పశ్చిమ బెంగాల్ గవర్నర్ కు జగదీప్ ధంకార్ కు విద్యార్ధులతో చేదు అనుభవం ఎదురైంది. జాదవ్ పూర్ యూనివర్శిటీకి వెళ్లిన గవర్నర్  జగదీప్ ను వర్శిటీ విద్యార్ధులు అడ్డుకున్నారు. గవర్నర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వర్శిటీకి వచ్చిన గవర్నర్ ను విద్యార్ధులు కనీసం కారు కూడా దిగనివ్వలేదు.  

జాదవ్ పూర్ యూనివర్శిటీలో స్నాతకోత్సవం కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన గవర్నర్ కు విద్యార్ధులు అడ్డుకున్నారు. గో బ్యాక్ గవర్నర్అంటూ నినాదాలు చేశారు.  విద్యార్థుల దెబ్బకు ఆయన దాదాపు రెండు గంటలపాటు కారులోనే కూర్చున్నారంటే..నిరసన చేస్తున్న విద్యార్ధుల పట్టుదల ఆక్కడి పరిస్థితి ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. 

గవర్నర్ జగదీప్ ధంకార్ యూనివర్శిటీ వద్దకు రాగానే విద్యార్ధులంతా ఆయన కారును చుట్టు ముట్టి ఘెరావ్ చేశారు. పౌరసత్వ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విద్యార్ధులు నల్ల జెండాలు, ప్లకార్డులతో నిరసన తెలిపారు. ‘బీజేపీ కార్యకర్త .. గవర్నర్ జగదీప్ ధంకార్’ గో బ్యాక్ అంటూ రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. దాదాపు   గంటలపాటు ఆయన్ను కారు కూడా దిగనివ్వలేదు. పోలీసులు జోక్యం  చేసుకున్నా..విద్యార్ధులు ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో గవర్నర్ విద్యార్ధుల తీరుపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తంచేశారు.