Ladakh Covid Warriors: లడఖ్ కొవిడ్ వారియర్స్ జేసీబీలో నది దాటుతూ..

డాక్టర్లు, హెల్త్‌కేర్ వర్కర్లు, శానిటేషన్ వర్కర్లు, వాలంటీర్లు నిర్విరామంగా కృషి చేస్తూ కొవిడ్-19పై పోరాడుతూ ఉన్నారు. విపత్కర పరిస్థితులు, నష్టపోయిన ఫ్యామిలీలు, ప్రకృతి వైపరీత్యాలు లాంటి క్లిష్ట సమయాల్లోనూ సేవలందిస్తూనే ఉన్నారు.

Ladakh Covid Warriors

Ladakh Covid warriors: డాక్టర్లు, హెల్త్‌కేర్ వర్కర్లు, శానిటేషన్ వర్కర్లు, వాలంటీర్లు నిర్విరామంగా కృషి చేస్తూ కొవిడ్-19పై పోరాడుతూ ఉన్నారు. విపత్కర పరిస్థితులు, నష్టపోయిన ఫ్యామిలీలు, ప్రకృతి వైపరీత్యాలు లాంటి క్లిష్ట సమయాల్లోనూ సేవలందిస్తూనే ఉన్నారు.

లడఖ్ లోనూ ఇలాంటి ఓ ఘటనే కనిపించింది. హెల్త్ కేర్ వర్కర్ల గ్రూపు నది దాటేందుకు వేరే సౌకర్యం లేకపోవడంతో జేసీబీ పైకి ఎక్కి అటువైపుకు చేరుకున్నారు. లడఖ్ ఎంపీ త్సెరింగ్ నంగ్యాల్ ఆ (జేసీబీ మెషీన్ పై నలుగురు హెల్త్ కేర్ వర్కర్లు కూర్చొని ప్రవాహ వేగం ఎక్కువగా ఉన్న నదిని దాటుతూ కనిపించే ) ఫొటోను షేర్ చేశారు.

దాంతో పాటు సెల్యూట్ కొవిడ్ వారియర్స్. వారి సర్వీసులను అందించేందుకు లడఖ్ లోని గ్రామీణ ప్రాంతాలకు చేరుకునేందుకు నది ఇలా దాటుతున్నారు. ఇంట్లోనే ఉండండి. సేఫ్ గా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. కొవిడ్ వారియర్స్ కు సహకరించండి. అంటూ పోస్టు పెట్టారు.

ఎంపీని కదిలించిన ఫొటో నెటిజన్లలోనూ స్పందన పుట్టించింది. కొవిడ్ వారియర్స్ కు సెల్యూట్ అంటూ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. గతేడాదిగా లడఖ్ లో 195కరోనా మృతులు సంభవించగా.. ప్రస్తుతం అక్కడ కేసులు వెయ్యి 11 మాత్రమే ఉన్నాయి.