Elephant on Tracks: రైలు పట్టాలపై ఏనుగు: చివరి క్షణంలో స్పందించిన లోకో పైలట్

రైలు పట్టాలు దాటేందుకు ప్రయత్నిస్తున్న ఒక ఏనుగును చూసి సకాలంలో స్పందించిన లోకో పైలట్ రైలును ఆపడంతో ఆ ఏనుగు సురక్షితంగా బయటపడింది.

Elephant on Tracks: పట్టాలు దాటుతూ వన్యప్రాణులు రైలు కింద పడి..మృతి చెందిన సందర్భాలు అనేకం చూసేఉంటారు. జంతువులు అడ్డంగా వచ్చినపుడు రైలు వేగాన్ని నియంత్రించలేని లోకో పైలట్..నిస్సహాయ స్థితిలో జంతువులపై నుంచి రైలును పోనిస్తారు. ఒక అంచనా ప్రకారం భారత్‌లో అనారోగ్యాలు, ఇతర కారణాల కంటే ఎక్కువగా వన్యప్రాణులు రైలు ప్రమాదాల భారిన పడి మృతి చెందుతున్నాయి. తాజాగా, రైలు పట్టాలు దాటేందుకు ప్రయత్నిస్తున్న ఒక ఏనుగును చూసి సకాలంలో స్పందించిన లోకో పైలట్ రైలును ఆపడంతో ఆ ఏనుగు సురక్షితంగా బయటపడింది. నార్త్ బెంగాల్ రైల్వే డివిజన్ పరిధిలోని గుల్మ – సివోక్ మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. గుల్మ – సివోక్ మధ్య KM 23/1 ప్రాంతం వద్ద ఒక ఏనుగు రైల్వే ట్రాక్ దాటేందుకు ప్రయత్నిస్తుంది. అయితే స్థానికుల అరుపులతో కంగారుపడ్డ ఏనుగు..ట్రాక్ దాటలేక పక్కనే నిలుచుంది.

Read Other:India Corona: దేశంలో అదుపులోనే కరోనా.. పెరిగిన రికవరీ రేటు

ఇంతలో అటుగా..సిలిగురి – అలీపూర్‌దువార్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ దూసుకువస్తుంది. అయితే దూరంగా ఏనుగును గమనించిన లోకో పైలట్లు ఆర్.ఆర్ కుమార్, ఎస్.కుందూ..రైలు వేగాన్ని తగ్గించారు. రైలుని గమనించని ఏనుగు అంతలోనే ఒక్క ఉదుటున పట్టాలు దాటేసింది. ఒక్క క్షణం అటూఇటూ అయితే ఏనుగు మృత్యువాత పడేది. కాగా, సకాలంలో స్పందించి రైలుని నియంత్రించి ఏనుగు సురక్షితంగా పట్టాలు దాటేలా లోకో పైలట్ చూపిన చొరవపై రైల్వేశాఖ ఉన్నతాధికారులు అభినందించారు. ఈ దృశ్యాన్ని లోకో పైలట్ ఒకరు వీడియో తీయగా..నార్త్ బెంగాల్ డివిజనల్ రైల్వే అధికారి ట్విట్టర్ లో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవగా..లోకో పైలట్లపై నెటిజెన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

read others:Weather Report : చల్లని కబురు.. ముందే రానున్న నైరుతి రుతుపవనాలు

ట్రెండింగ్ వార్తలు