India Corona: దేశంలో అదుపులోనే కరోనా.. పెరిగిన రికవరీ రేటు

ప్రపంచ దేశాలను వణికించిన కరోనా భారత్‌లో అదుపులోనే ఉంది. ఇటీవల కేసుల ఉధృతి పెరుగుతుందని అనిపించినప్పటికీ ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. రోజువారి కేసులు మూడు వేలలోపే నమోదవుతున్నాయి. అయితే ...

India Corona: దేశంలో అదుపులోనే కరోనా.. పెరిగిన రికవరీ రేటు

Corona Cases

India Corona: ప్రపంచ దేశాలను వణికించిన కరోనా భారత్‌లో అదుపులోనే ఉంది. ఇటీవల కేసుల ఉధృతి పెరుగుతుందని అనిపించినప్పటికీ ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. రోజువారి కేసులు మూడు వేలలోపే నమోదవుతున్నాయి. అయితే కొవిడ్ వ్యాప్తిని పూర్తిస్థాయిలో అరికట్టేందుకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, ఆ మేరకు ప్రజలను రాష్ట్రాలు అప్రమత్తం చేయాలని ఇప్పటికే కేంద్రం సూచించింది. ఇక వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశంలో ముమ్మరంగా కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా విడుదల చేసిన వివరాల ప్రకారం.. భారతదేశంలో గడిచిన 24 గంటల్లో 2,841 కొత్త కోవిడ్ -19 కేసు నమోదయ్యాయి. కొవిడ్ తో చికిత్స పొందుతూ తొమ్మిది మంది మృతి చెందారు.

Coronavirus: దేశంలో తగ్గిన కొవిడ్ కొత్త కేసులు.. 10మంది మృతి

దేశవ్యాప్తంగా గురువారం 4.86 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 2,841 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. 24 గంటల వ్యవధిలో 3,295 మంది కోలుకున్నారు. మరోరోజు కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా నమోదుకావడం సానుకూలాంశం. మహమ్మారి కట్టడిలో ఉండటంతో క్రియాశీల కేసులు 18 వేలకు దిగొచ్చాయి. సుమారు రెండేళ్ల కాలంలో 4.31 కోట్ల మందికి కరోనా సోకగా.. 4.25 కోట్ల మందికి పైగా కోలుకున్నారు. రికవరీ రేటు 98.74 శాతానికి చేరింది. క్రియాశీల రేటు 0.04 శాతంగా కొనసాగుతోంది. గురువారం తొమ్మిది మంది కొవిడ్ తో చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాలు 5.24 లక్షలకు చేరింది. మరోపక్క గురువారం 14.03 లక్షల మంది టీకా తీసుకోగా, 190 కోట్లకు పైగా డోసులను వైద్య ఆరోగ్య శాఖ అందించింది.

Coronavirus: గాలిలోని కొవిడ్ కణాలతో కరోనా వ్యాప్తి

ఇదిలా ఉంటే విదేశాలకు వెళ్లే భారతీయ పౌరులు, విద్యార్థులు కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారం కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోలని గురువారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ కొత్త సదుపాయం త్వరలో CoWIN పోర్టల్‌లో అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ఒక ట్వీట్‌లో తెలిపారు.