ఫోని ఎఫెక్ట్ : 3వేల శిబిరాల్లోకి 7 లక్షల మంది తరలింపు

  • Publish Date - May 2, 2019 / 06:33 AM IST

ఫోని తుఫాన్‌తో ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు చర్యలు తీసుకున్నట్లు స్పెషల్ రిలీఫ్ కమిషనర్ వెల్లడించారు. 25వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. మే 02వ తేదీ గురువారం మీడియాతో మాట్లాడారు. తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోందని, సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ప్రకటించారాయన. 3వేల కేంద్రాల్లో 7 లక్షల మంది తలదాచుకున్నారన్నారు. తిత్లీ తుఫాన్ కన్నా ఫోని ఎక్కువ ప్రభావం చూపిస్తుందని భారత వాతావరణ ఏడీజీ మోహపాత వెల్లడించారు. 

మరోవైపు NDRF బృందాలు రంగంలోకి దిగాయి. కోనార్క్ ప్రాంతంలో రెండు ODRAF టీంలు చర్యల్లో నిమగ్నమైంది. జనరేటర్లు, చెట్లు కూలిపోతే వెంటనే తొలగించే సామాగ్రీతో సిద్ధమయ్యారు. తుఫాన్ కారణంగా దక్షిణ మధ్య రైల్వే అలర్ట్ అయ్యింది. పలు రైళ్లను రద్దు చేయగా మిగతా వాటిని దారి మళ్లించారు. పూరీలో రెండు స్పెషల్ ట్రైన్‌లను ఏర్పాటు చేసింది అక్కడి ప్రభుత్వం. మే 02వ తేదీ గురువారం ప్రత్యేక రైళ్ల ద్వారా టూరిస్టులు, స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నారు.