జలంధర్‌లో బీభత్సం : గ్రామంలో చిరుత హల్ చల్

  • Publish Date - February 1, 2019 / 04:12 PM IST

చండీగఢ్: అడవుల్లో ఉండాల్సిన చిరుత జనావాసాలపై  పడి బీభత్సం సృష్టించింది. పంజాబ్ లోని జలంధర్ లో జరిగిన ఈ ఘటనతో ప్రజలు హఢలెత్తిపోయారు. అటవీ అధికారులకు సమాచారం ఇవ్వటంతో ట్రాంక్విలైజర్స్ ఉపయోగించి చిరుతను  పట్టుకుని  చాట్ బీర్ జూకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన  వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

హిమాచల్ల ప్రదేశ్  అడవుల్లోంచి  పారిపోయి వచ్చిన చిరుత జలంధర్ చేరుకుని ఉంటుందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. చిరుతను గమనించిన స్ధానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వలవేసి పట్టుకుందామనుకుంటే తప్పించుకుని జనాలపై దాడి చేసింది. చివరికి  మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి చిరుతను పట్టుకుని జూకు తరలించారు అధికారులు.