Maha vs Karnataka: చైనా తరహాలో కార్ణాటకలోకి దూకుతామంటూ శివసేన వార్నింగ్.. ఐక్యంగా ఉందామని షిండే రిక్వెస్ట్

చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని మేము అనుకుంటున్నాం. కానీ కర్ణాటక ముఖ్యమంత్రి అగ్గిరాజేస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం బలహీనంగా ఉండడం వల్ల సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. చర్చలకు స్వాగతించి, తొందరగా పరిష్కారం చూపితే సరే సరి. లేదంటే మేము కూడా చైనా తరహాలో కర్ణాటకలో అడుగు పెట్టాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఎవరి అనుమతి మాకు అక్కర్లేదు

Maha vs Karnataka: ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తల నడుమ సాగుతున్న మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు అంశంలో శివసేన తనదైన శైలిలో స్పందించి వివాదానికి మరింత అగ్గిని రాజేసింది. చర్చల ద్వారా అవుతుందంటే మంచిదే కానీ, అలా కుదరదంటే చైనా తరహాలో కర్ణాటకలో తాము అడుగు పెట్టాల్సి ఉంటుందని శివసేన హెచ్చరించింది. ఈ అంశంపై తమకు ఎలాంటి అనుమతి అవసరం లేదని శివసేన తేల్చేసింది. చర్చల ద్వారా అయ్యేదాన్ని తోసిపుచ్చి కర్ణాటక ముఖ్యమంత్రి అగ్గిరాజేస్తున్నారని ఆరోపించింది. అయితే కర్ణాటక సీఎం ఈ విషయంలో చాలా సీరియస్ ఉన్నప్పటికీ మహారాష్ట్రలోని ప్రభుత్వం బలహీనంగా ఉందని విమర్శించింది. ఈ కారణం వల్లే దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతోందని పేర్కొంది. దశాబ్దానికి పైగా ఇరు రాష్ట్రాల మధ్య నలుగుతున్న సరిహద్దుల వివాదం ముదిరి సుప్రీంకోర్టుకు సైతం చేరిన నేపథ్యంలో శివసేన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Rajasthan: రెండు చిత్రాలు, ఒకే ప్రశ్న.. గెహ్లాట్, పైలట్‭లను రాహుల్ ఏకం చేయగలరా?

ఈ విషయమై తాజాగా శివసేన (ఉద్ధవ్ వర్గం) నేత సంజయ్ రౌత్ స్పందిస్తూ ‘‘చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని మేము అనుకుంటున్నాం. కానీ కర్ణాటక ముఖ్యమంత్రి అగ్గిరాజేస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం బలహీనంగా ఉండడం వల్ల సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. చర్చలకు స్వాగతించి, తొందరగా పరిష్కారం చూపితే సరే సరి. లేదంటే మేము కూడా చైనా తరహాలో కర్ణాటకలో అడుగు పెట్టాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఎవరి అనుమతి మాకు అక్కర్లేదు’’ అని అన్నారు.

Durbari Kutte: ‘సోనియా గాంధీ కుక్కలు’.. ఖర్గే ‘కుక్క’ వ్యాఖ్యలపై వివాదాస్పదంగా స్పందించిన బీజేపీ నేత

ఈ విషయంలో కార్ణాటక ప్రభుత్వం దూకుడు మీదే ఉన్నప్పటికీ మహారాష్ట్ర ప్రభుత్వం మెతక వైఖరి ప్రదర్శిస్తోంది. దీంతో ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది. మహారాష్ట్ర శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లోనూ విపక్షాలు ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి. ప్రతిపక్ష నేత అజిత్ పవార్ ఈ అంశాన్ని తాజాగా ప్రస్తావిస్తూ, మహారాష్ట్రకు చెందిన లోక్‌సభ సభ్యుడిని బెల్గాంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్‌షాతో జరిగిన సమావేశంలో బెల్గాం వెళ్లకుండా ఎవరినీ ఆపరాదనే నిర్ణయం తీసుకున్నప్పటికీ, అక్కడి కలెక్టర్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు. దీనికి సీఎం ఏక్‌నాథ్ షిండే సమాధానమిస్తూ, రెండు రాష్ట్రాల సరిహద్దు సమస్యపై తొలిసారి దేశ హోం మంత్రి మధ్యవర్తిత్వం వహిస్తున్నారని చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా సరిహద్దు నివాసులను కలుపుకొని ఏకతాటిపై మనమంతా ఉండాలని షిండే కోరారు.

ట్రెండింగ్ వార్తలు