Rajasthan: రెండు చిత్రాలు, ఒకే ప్రశ్న.. గెహ్లాట్, పైలట్‭లను రాహుల్ ఏకం చేయగలరా?

2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపులో సచిన్ పైలట్ పాత్ర ఎక్కువగా ఉందని అంటారు. అయినప్పటికీ అశెక్ గెహ్లాట్ వైపే అధిష్టానం మొగ్గు చూపడంతో పైలట్ రెబెల్‭గా మారారు. అధిష్టానం ఎలాగోలా సర్ది చెప్పి పైలట్‭ను చల్లబర్చింది. కానీ అప్పటి వరకు ఉన్న రాజస్తాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పదవుల్ని తొలగించింది. ఇక కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ముందు అధిష్టానం ఒక అద్భుతమైన ఎత్తు వేయబోయి విఫలమైంది

Rajasthan: రెండు చిత్రాలు, ఒకే ప్రశ్న.. గెహ్లాట్, పైలట్‭లను రాహుల్ ఏకం చేయగలరా?

Can Rahul Gandhi bring Gehlot, Pilot together?

Rajasthan: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 100 రోజులు పూర్తి చేసుకుంది. కన్యాకుమారి నుంచి మొదలైన ఈ పాదయాత్ర తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటి వరకు సాగింది. జమ్మూ కశ్మీర్‭లోని శ్రీనగర్ వరకు సాగనున్న ఈ పాదయాత్ర ప్రస్తుతం రాజస్తాన్ రాష్ట్రంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీకి ఎంతో కీలకమైన రాష్ట్రాల్లో రాజస్తాన్ ఒకటి. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో రాజస్తాన్ ఒకటి కావడం ఒక అంశమైతే, ఒకే రాష్ట్రంలో పార్టీకి ఇద్దరు ఇద్దరు బలమైన నేతలు ఉండడం మరొక కారణం. ఈ నేపథ్యంలో రాహుల్ జోడో యాత్ర ఈ రాష్ట్రంలో జోరుగా సాగుతుందనే పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Wilful Defaulters: టాప్-50 ఉద్దేశపూర్వక డిఫాల్టర్లు బ్యాంకులకు పెట్టిన టోకరా ₹ 92,570.. ఇందులో టాప్‭-1 ఎవరో తెలుసా?

అయితే ఇంతటి కీలకమైన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద చిక్కొచ్చి పడింది. ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‭కు ముఖ్యమంత్రి ఆశావాహుడు సచిన్ పైలట్‭కు మధ్య ఉప్పునీళ్లు పోసినా పెట్రోల్ కంటే వేగంగా మండే పరిస్థితులు కొనసాగుతున్నాయి. జోడో యాత్రలో భాగంగా ఇరు నేతలతో చాలా సన్నిహితంగా, చాలా ఆప్యాయతగా ఉంటున్నారు రాహుల్ గాంధీ. ఇరు నేతలను కౌగిళించుకుని వారితో తన సాన్నిహిత్యాన్ని తెలిపే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడే రాహుల్ గాంధీకి ఒక ప్రశ్న ఎదురవుతోంది. ఇరు నేతల్ని రాహుల్ గాంధీ ఏకం చేస్తారా? అని భారత్ జోడో యాత్ర రాజస్తాన్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి రాహుల్ గాంధీకి ఎదరవుతోన్న ప్రశ్న. అయితే తాజాగా ఇదే ప్రశ్న అడగ్గా, తొందరలోనే శుభవార్త వింటారని రాహుల్ అన్నారు.

Durbari Kutte: ‘సోనియా గాంధీ కుక్కలు’.. ఖర్గే ‘కుక్క’ వ్యాఖ్యలపై వివాదాస్పదంగా స్పందించిన బీజేపీ నేత

2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపులో సచిన్ పైలట్ పాత్ర ఎక్కువగా ఉందని అంటారు. అయినప్పటికీ అశెక్ గెహ్లాట్ వైపే అధిష్టానం మొగ్గు చూపడంతో పైలట్ రెబెల్‭గా మారారు. అధిష్టానం ఎలాగోలా సర్ది చెప్పి పైలట్‭ను చల్లబర్చింది. కానీ అప్పటి వరకు ఉన్న రాజస్తాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పదవుల్ని తొలగించింది. ఇక కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ముందు అధిష్టానం ఒక అద్భుతమైన ఎత్తు వేయబోయి విఫలమైంది. గెహ్లాట్‭ను పార్టీ అధ్యక్షుడిగా చేసి పైలట్‭ను ముఖ్యమంత్రి చేసేందుకు సిద్ధమైంది. ఇలా ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొడదామనుకుంది. కానీ ఈసారి గెహ్లాట్ రెబెల్‭గా మారడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది.

Rajasthan: చేతులు కలిపిన ఇద్దరు బద్ధ శత్రువులు.. రాజస్తాన్‭ రాజకీయాల్లో ఏం జరుగుతోంది?

ఇప్పటికిప్పుడు గెహ్లాట్‭ను ఆ పదవి నుంచి తప్పించి పైలట్‮‭ను నియమించవచ్చు. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న రాష్ట్రాలు మూడే. అందులో రాజస్తాన్ ఒకటి. పైగా దీనికి ముందే పంజాబ్ అనుభవం ఎలాగూ ఉంది. దీంతో వచ్చే ఎన్నికల వరకు ఎలాంటి మార్పులు చేయొద్దని నిర్ణయించుకుని, రాబోయే ఎన్నికల అనంతరం నాటికి పైలట్‭కు ముఖ్యమంత్రి పదవి ప్రామిస్ చేసింది కాంగ్రెస్. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ, ఇప్పటికీ ఈ ఇద్దరు నేతల మధ్య కోల్డ్ వార్ ఇంకా కొనసాగుతోందనే వార్తలు అయితే గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలో దేశాన్ని ఐక్యం చేయాలని యాత్ర చేపట్టిన రాహుల్.. ఈ యాత్రతో వీరిలో ఎంత వరకు ఐక్యతను తీసుకు వస్తారనేది ప్రధానాంశంగా మారింది.