Lionel Messi : బీడీ ప్యాకెట్లపై ఫుట్ బాల్ ప్లేయర్ల ఫోటోలు : వైరల్

ఫుట్ బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ చిత్రంతో ఉన్న ఓ బీడీ ప్యాకెట్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. పశ్చిమ బెంగాల్‌లోని ధూలియన్‌లో ఆరిఫ్‌ బీడీ ఫ్యాక్టరీ వీటిని తయారు చేసినట్లు తెలుస్తోంది.

Lionel Messi  :  ఏ కొత్త వస్తువైనా మార్కెట్ లో సేల్స్ పెంచుకోటానికి ప్రజలకు చేరువ కావటానికి ప్రకటనలు ఎంతో అవసరం. అందుకు ఉత్పత్తిదారులు ప్రకటనల కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని ఆకర్షణీయంగా ఉండేట్లు ప్రకటనలు రూపోందించుకుంటారు. ఇకపోతే వీటిలో సెలబ్రిటీలు బ్రాండ్ అంబాసిడర్‌లుగా కనిపిస్తే ఆ ఉత్పత్తుల వ్యాపారం బాగా సాగుతుందనే నమ్మకం ఉంది. సెలబ్రిటీలు ఒక ప్రోడక్ట్ గురించి చెప్పారు అంటే మార్కెట్ లో దాని సేల్స్ అనూహ్యంగా పెరుగుతుందనేది మార్కెట్ విశ్లేషకులు చెపుతారు.

ఆ మధ్య కాలంలో క్రిస్టియానో ​​రొనాల్డో ప్రెస్‌ మీట్‌లో కోక్‌ బాటిళ్లను పక్కకు జరిపి మంచి నీళ్లే తాగాలంటూ.. ఇచ్చిన పిలుపుతో .. కోలా బ్రాండ్‌కు ఊహించని స్థాయిలో నష్టాన్ని తెచ్చిపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంవరకూ తెలుగు హీరోలు కొందరు బంగారం వ్యాపారానికి, ఫైనాన్స్ కంపెనీల ప్రకటనల్లో కూల్ డ్రింక్స్ యాడ్స్ లో కనిపించేవారు. పాతకాలం నాటి హీరో జాకీష్రాఫ్ సిగరెట్ కంపెనీ యాడ్ లో కనిపించారు.

అయితే తాజాగా ఫుట్ బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ చిత్రంతో ఉన్న ఓ బీడీ ప్యాకెట్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. పశ్చిమ బెంగాల్‌లోని ధూలియన్‌లో ఆరిఫ్‌ బీడీ ఫ్యాక్టరీ వీటిని తయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని భారత ఐఏఎస్‌ అధికారి రూపీన్‌ శర్మ ‘‘ మెస్సీ ఫస్ట్‌ ఎండోర్స్‌మెంట్‌ ఇన్‌ ఇండియా’’ అనే క్యాప్షన్‌తో సోషల్‌ మీడియాలో దీన్ని పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Lionel Messi And Cristiano Ronaldo

దీనిపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ ‘‘ మెస్సీ ఏజెంట్లు దీన్ని చూడరని, బీడీ కంపెనీ నుంచి రాయల్టీ కోసం క్లెయిమ్‌ చేయరని ఆశిస్తున్నాను అని వ్యాఖ్యానించాడు. ఇది బెంగాల్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్‌ అయి ఉండాలి.’’ అంటూ కామెంట్‌ చేశాడు. అయితే కేవలం మెస్సీ చిత్రంతో ఉన్న బీడీ ప్యాకెట్‌నే కాదు. పోర్చుగీస్ ఫుట్ బాల్ ఆటగాడు క్రిస్టియానో ​​రొనాల్డో ఫోటోతో ఉన్న బీడీ ప్యాకెట్ల చిత్రాలను కూడా నెటిజన్లు షేర్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు