List of Most Polluted Indian Cities Released
Polluted Indian Cities: ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల్లో మెజారిటీ నగరాలు మన దేశంలో ఉంటున్నాయి. దేశంలో పెరిగిపోతున్న కాలుష్యం, వాటికి అడ్డుకట్ట వేసే చర్యలు లేకపోవడం ఇందుకు ప్రధాన కారణమని విశ్లేషకులు అంటున్నారు. టాప్-10 లెక్క చూసినా ఎక్కువ నగరాలు సగానికి పైగా నగరాలు మళ్లీ మన దేశంలోనివే. ఇక మన దేశ రాజధాని ఢిల్లీ.. ప్రపంచ కాలుష్య రాజధానిగా నెంబర్ వన్ స్థానంలో వరుసగా మూడేళ్లు తన స్థానాన్ని పదిలపర్చుకుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇకపోతే.. తాజాగా దేశంలోని అత్యంత కాలుష్యకారక నగరాల జాబితా-2022ను సెంట్రల్ పోల్యూషన్ కంట్రోల్ బోర్డు శుక్రవారం విడుదల చేసింది. ఇందులో బిహార్లోని మొతిహారి 413 (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఇక అదే రాష్ట్రానికి చెందిన మరో నగరం సివాన్ 406 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. మొత్తం 163 నగరాలతో విడుదల చేసిన ఈ జాబితాలో ఢిల్లీ గతంతో పోలిస్తే కాస్త మెరుగ్గా కనిపించడం గమనార్హం. ఢిల్లీ టాప్-10ను దాటి 346 పాయింట్లతో 11వ స్థానంలో ఉంది.
ఇక మూడవ స్థానంలో బెత్తియా (395), నాల్గవ స్థానంలో దర్భంగ (388), ఐదవ స్థానంలో బెగుసరై (381), ఆరవ స్థానంలో బక్సర్ (377), ఏడవ స్థానంలో జింద్ (371), ఎనిమిదవ స్థానంలో పూర్ణియా (358), తొమ్మిదవ స్థానంలో సహర్స (358), పదవ స్థానంలో గురుగ్రామ్ (353) ఉన్నాయి. ఢిల్లీ సమీపంలోని నోయిడా (328), ఘజియాబాద్ (328) పాయింట్ల కాలుష్యం ఉంది. మొత్తంగా చూసుకుంటే బిహార్లోని నగరాలు ఎక్కువగా కాలుష్యంలో ఉన్నాయి. ఇక ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాది నగరాలు కాలుష్యానికి కొంత దూరంలో ఉన్నాయి. ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో కూడా పై నగరాలతో పోల్చుకుంటే కాలుష్యం కాస్త తక్కువగానే ఉంది.
Elon Musk: ట్విట్టర్ దివాలాపై ఎలాన్ మస్క్ ఆందోళన.. ఉద్యోగులకు గట్టి వార్నింగ్