Lok Sabha : మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు లోక్ సభ ఆమోదం

మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు లోక్ సభలో ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో లోక్ సభ ఆమోదం తెలిపింది. విపక్షాల ఆందోళన మధ్యే మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు ఆమోదం తెలిపింది.

three agricultural laws repeal bill : మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు లోక్ సభలో ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో లోక్ సభ ఆమోదం తెలిపింది. విపక్షాల ఆందోళన మధ్యే మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు ఆమోదం తెలిపింది. ఎలాంటి చర్చ లేకుండానే మూడు చట్టాల రద్దు బిల్లుకు ఆమోదం లభించింది. మూడు వ్యవసాయ చట్టాలపై చర్చ ఎందుకు చేపట్టరంటూ కాంగ్రెస్ ఎంపీ అరిందమ్ చౌదరి నిలదీశారు.

హైడ్రామా నడుమ లోక్‌సభ ముందు మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు తీసుకొచ్చారు. మూడు చట్టాల రద్దు బిల్లును కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. మూడు చట్టాలపై చర్చకు కాంగ్రెస్‌ పట్టుబడింది. విపక్ష సభ్యుల తీరుపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Two Workers Killed : విశాఖ పరవాడ ఫార్మాసిటీలో విషవాయువులు లీకై ఇద్దరు కార్మికులు మృతి

వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ఇటీవల ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును కేంద్ర కేబినెట్ కూడా గత వారం ఆమోదించింది. ఈ నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సోమవారం లోక్ సభలో మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును ప్రవేశపెట్టారు. స్పీకర్ లోక్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.

పార్లమెంట్ సమావేశాలు తొలి రోజే వాయిదా పర్వంతో మొదలయ్యింది. పార్లమెంటు కార్యకలాపాలు ప్రారంభమైన కొద్దిసేపటికే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. వివిధ అంశాలపై చర్చ చేపట్టాలంటూ లోక్‌సభలో టీఆర్ఎస్‌ సభ్యులు ఆందోళన చేపట్టారు.

Omicron : ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త వేరియంట్..159కి చేరిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య

ధాన్యం కొనుగోళ్లపై క్లారిటీ ఇవ్వాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో సభాపతి సభను గంటపాటు వాయిదా వేశారు. అటు.. సిట్టింగ్‌ ఎంపీ ఆస్కార్‌ ఫెర్నాండేజ్‌ మృతికి సంతాపంగా రాజ్యసభను ఛైర్మన్‌ గంటపాటు వాయిదా వేశారు.

ట్రెండింగ్ వార్తలు