Omicron : ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త వేరియంట్..159కి చేరిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య

ఒమిక్రాన్‌ వ్యాపించిన దేశాల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది. ఒమిక్రాన్ కేసులు నమోదైన దేశాల జాబితాలో ఆస్ట్రేలియా, నెదర్లాండ్‌లు కూడా చేరాయి.

Omicron : ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త వేరియంట్..159కి చేరిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య

Omicron

new variant omicron cases : ఒమిక్రాన్‌ వ్యాపించిన దేశాల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది. ఒమిక్రాన్ కేసులు నమోదైన దేశాల జాబితాలో.. ఆస్ట్రేలియా, నెదర్లాండ్‌లు కూడా చేరాయి. ఆస్ట్రేలియా వైద్యాధికారులు రెండు కేసుల్ని గుర్తించారు. దక్షిణాఫ్రికా నుంచి దోహా మీదుగా సిడ్నీ చేరుకున్న ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా ఒమిక్రాన్ సోకినట్టు నిర్ధారణ అయింది.

అయితే, ఒమిక్రాన్‌ సోకిన వారిలో కరోనా లక్షణాలు లేవని, వీరిద్దరూ రెండు డోసుల టీకాలు తీసుకున్నారని తెలిపారు వైద్య నిపుణులు. వారిద్దరినీ క్వారంటైన్‌కు పంపారు. వారితో సన్నిహితంగా మెలిగినట్టు అనుమానమున్న 260మంది ప్రయాణికులు, సిబ్బందిని కూడా ఐసోలేషన్‌కు పంపారు.

Penna River : నెల్లూరులో ఉధృతంగా ప్రవహిస్తున్న పెన్నానది..సమీపంలోని ఇళ్లు కూలిపోయే ప్రమాదం

తమ దేశంలోనూ ఒమిక్రాన్ కేసులు 13 నమోదయ్యాయని ప్రకటించింది నెదర్లాండ్ ఆరోగ్యశాఖ. దక్షిణాఫ్రికా నుంచి విమానాల్లో తమ దేశానికి చేరుకున్నవారికి పరీక్షలు నిర్వహించగా.. 61మందికి పాజిటివ్ రాగా, వారందరినీ హోటళ్లలో ఐసోలేషన్‌కు పంపామని వారు తెలిపారు. జీనోమ్ సీక్వెన్సింగ్‌లో 13మందికి ఒమిక్రాన్ నిర్ధారణ అయిందన్నారు.

ఇప్పటికే ఒమిక్రాన్ కేసులు నమోదైన జాబితాలో బోట్స్‌వానా, బెల్జియం, హాంకాంగ్,జర్మనీ, చెక్ రిపబ్లిక్, ఇజ్రాయెల్, ఇటలీ, బ్రిటన్ ఉన్నాయి. హాంకాంగ్‌లో నమోదైన రెండు కేసుల్లోనూ స్వల్ప లక్షణాలే కనిపించాయని తెలిపారు ఆ దేశ అధికారులు. ఒమిక్రాన్‌ భయంతో దక్షిణాఫ్రికా నుంచి రాకపోకలపై 18 దేశాలు ఆంక్షలు విధించాయ్‌..