Lok Sabha elections 2024: ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా ప్రభావం చూపనున్న 10 కీలక అంశాలు ఇవే..

కాంగ్రెస్ కూడా కలసి వచ్చిన పార్టీలతో ముందుకుపోతుంది.. సీఏఏ ప్రభావం హిందూ సెంటిమెంట్‌ ను పెంచడానికే.. ఎన్నికలకు ముందు బీజేపీ పెద్దలు తెరపైకి తెచ్చారని అభిప్రాయపడుతున్నారు నిపుణులు.

సార్వత్రిక సమరం మొదలైంది. పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. లీడర్లు జనం బాట బాట్టారు. అయితే ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పలు అంశాలు కీలకంగా మారనున్నాయి. అయోధ్య రామమందిరం నుంచి వారం రోజులక్రితం తెరపైకి వచ్చిన సీఏఏ వరకు ప్రతి అంశం ప్రభావితం చేయనుంది. ఎన్నికల్లో పార్టీల ఎత్తులేంటి..గెలుపోటములను డిసైడ్ చేసే అంశాలేంటి?

గల్లీ నుంచి ఢిల్లీ దాకా.. పార్టీలన్నీ ప్రచారంపై ఫోకస్ చేశాయి. దేశవ్యాప్తంగా పది కీలక అంశాలు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి. ఇండియా కూటమి రాణించాలన్నా.. బీజేపీ 370 సీట్లు సాధించాలన్నా ఆ పది అంశాల చుట్టే దేశ రాజకీయం తిరగనుంది. చాన్నాళ్లుగా ఆ అంశాలు ప్రచారంలో ఉన్నా..ఎన్నికల్లో మాత్రం అధికార, విపక్షాలకు ఎజెండా కానున్నాయి.

రామమందిరం అంశం సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా మారనుంది. రెండు నెలల క్రితమే రామాలయాన్ని ప్రారంభించి.. ప్రజల దృష్టిని ఆకర్షించింది బీజేపీ. నార్త్ టు సౌత్ వరకు రామమందిరం ఎఫెక్ట్ ఉంటుందని కమలనాథులు భావిస్తున్నారు. వాస్తవానికి బీజేపీ ప్రతీ ఎలక్షన్ అప్పుడు తమ మేనిఫెస్టోలో రామమందిర నిర్మాణం అంశాలన్ని ప్రస్తావిస్తుంది.

గత సార్వత్రిక ఎన్నికల సమయంలోనే.. ఈటర్మ్‌లో రామమందిరాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చింది. అందుకు తగ్గట్లుగా ఎప్పటి నుంచో సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసును పరిష్కరించి.. నిర్మాణం చేపట్టిన మూడేళ్లలోనే పూర్తి చేసింది మోదీ సర్కార్. ఇచ్చినమాట నిలబెట్టుకున్నాం కాబట్టి.. కచ్చితంగా తమకు కలిసి వస్తుందని భావిస్తోంది బీజేపీ.

సీఏఏ, జ్ఞానవాపి..
రామమందిరమే కాదు.. సీఏఏ, జ్ఞానవాపి మసీదులో హిందూ పూజలకు అనుమతి, జమ్మూకశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు ఇవన్నీ కీలకంగా మారనున్నాయి. సీఏఏ అంశం దేశవ్యాప్తంగా ఇంపాక్ట్ చూపించనుంది. పశ్చిమబెంగాల్, కేరళ వంటి రాష్ట్రాలు సీఏఏను అమలు చేయబోమని చెప్తున్నాయి. ఆ రాష్ట్రాల్లో సీఏఏనే కీలక అంశంగా మారే అవకాశం ఉంది. జమ్మూకశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు దేశవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించింది.

ఒకే దేశం, ఒకే జెండా, ఒకే రాజ్యాంగం..అనే నినాదంతో..ఆర్టికల్ 370ని రద్దు చేసి కశ్మీర్‌ను దేశంలో భాగం చేసింది మోదీ సర్కార్. పొత్తుల ఎత్తులు కూడా ఈ ఎన్నికల్లో కీరోల్ ప్లే చేయనున్నాయి. గతంలో ఎన్డీయేకూ దూరమైన పార్టీలను తిరిగి కూటమిలో చేర్చుకున్నారు ప్రధాని మోదీ. 2004లో పాశ్వాన్‌తో పాటు పలు పార్టీలను దూరం చేసుకుని బీజేపీ తగిన మూల్యం చెల్లించుకుంది.

దాంతో పదేళ్లపాటు అధికారానికి దూరమైంది. ప్రధాని మోదీ ఈ తప్పును సరిదిద్దుకుంటున్నారు. వరుసగా మూడోసారి 4వందల సీట్లతో అధికారంలోకి రావాలని భావిస్తోన్న మోదీ.. ఎన్డీయే కూటమి దూరమైన పార్టీలను ఒక్కొక్కటిగా తిరిగి దగ్గరికి చేర్చుకుంటున్నారు.

కూటమిని వీక్ చేయడంలో మోదీ సక్సెస్
బిహార్ సీఎం నితీశ్ కుమార్ నుంచి.. ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు వరకు అందరినీ దగ్గరకి చేర్చుకుంటున్నారు. నితీశ్ ను బయటికి తెచ్చి ఇండియా కూటమిని వీక్ చేయడంలో మోదీ సక్సెస్ అయ్యారు. ఇక ఏపీలో టీడీపీ, జనసేన పొత్తుతో సీన్ మార్చే ప్రయత్నం చేస్తున్నారు. కర్నాటకలో జేడీఎస్ తో కలిసి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయబోతుంది బీజేపీ.

బీజేడీతో చర్చలు ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. యూపీలోనూ చిన్నాచితక పార్టీలతో పొత్తు కుదిరింది. అటు మహారాష్ట్రలో బీజేపీ ఆధ్వర్యంలోని కూటమి పవర్ లో ఉంది. ఈ పొత్తులు కూడా ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేయనున్నాయి. కాంగ్రెస్ కూడా కలసి వచ్చిన పార్టీలతో ముందుకుపోతుంది. తమిళనాడులోని డీఎంకే, బిహార్‌లో ఆర్జేడీ, శరద్ పవార్‌ ఆధ్వర్యంలోని ఎన్సీపీ, ఢిల్లీ, పంజాబ్‌లో ఆప్, వామపక్షాలను కలుపుకుని ముందుకెళ్తుంది.

ఆయా రాష్ట్రాల్లో ఇండియా కూటమి ప్రభావం చూపే అవకాశం ఉంది. కొన్ని రాష్ట్రాల్లో కూటమి.. కీలక నేతల గెలుపోటములను డిసైడ్ చేసే అవకాశం కనిపిస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థ గతానికి ఇప్పటికి ఎలా ఉంది. మోదీ పదేళ్ల కాలంలో జీడీపీ వృద్ధి రేటు ఎంత అనేది కూడా ఎడ్యుకేటెడ్‌ సెక్టార్‌లో ప్రభావం చూపనుంది. స్టాక్ మార్కెట్, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీల సెక్టార్టలలో ఉన్నవారి ఓటుబ్యాంకును.. జీడీపీ వృద్ధి రేటు, ఆర్థిక వృద్ధి లాంటి అంశాలను ప్రభావం చేయొచ్చు.

ప్రస్తుతం ద్రవ్యోల్బణం. ధరల పెరుగుదల సామాన్యులపై తీవ్ర ఎఫెక్ట్ చూపిస్తుంది. నిత్యావసరాలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ రేట్లు అపోజిషన్ పార్టీలకు ప్రధాన అస్త్రంగా మారాయి.. ఐతే పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచడంతో పాటు ఒకటిరెండు సార్లు ధరలను తగ్గించింది కేంద్రం. నిత్యావసరాల విషయానికి వస్తే ఆహార ఎగుమతులను నిషేధించింది కేంద్రం. అదే సమయంలో 80 కోట్ల పేదలకు ఏడాదిపాటు ఉచిత బియ్యం పంపిణీ చేసింది మోదీ సర్కార్.

ఇది బీజేపీకి అనుకూల ప్రచార అంశంగా చెప్పుకోవచ్చు. ఇక ఎప్పటినుంచో నానుతూ వస్తోన్న సీఏఏ అంశాన్ని సరిగ్గా ఎన్నికల షెడ్యూల్ కు ముందే మరోసారి తెరపైకి తెచ్చింది కేంద్రప్రభుత్వం. CAA నిబంధనలను నోటిఫై చేసి మరోసారి చర్చకు దారితీసింది. పశ్చిమబెంగాల్, కేరళ ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో సీఏఏను అమలు చేయబోమని చెప్తున్నాయి.

అయితే సీఏఏ ప్రభావం హిందూ సెంటిమెంట్‌ ను పెంచడానికే.. ఎన్నికలకు ముందు తెరపైకి తెచ్చారని అభిప్రాయపడుతున్నారు నిపుణులు. ఇండియా కూటమి కూడా ముస్లిం, మైనార్టీలు ఉన్న రాష్ట్రాల్లో సీఏఏ అంశాన్ని తమకు పాజిటివ్‌గా వాడుకునేందుకు ప్రయత్నిస్తుంది.

వరల్డ్‌వైడ్‌గా భారత్‌ పలుకుబడి.. కీలక అంశాల్లో భారతదేశం పాత్ర వంటి అంశాలు కూడా సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మోదీ ప్రభుత్వం తెలివైన, శక్తివంతమైన దౌత్యం..పాకిస్థాన్, చైనా వంటి దేశాలతో ఢీ అంటే ఢీ అని మోదీ సర్కార్ ఇస్తున్న కౌంటర్ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా చైనా, పాకిస్థాన్ విషయంలో భారత్ ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. ఇదే విషయాన్ని గతానికి ఇప్పటికి పోలుస్తూ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తుంది బీజేపీ.

Chilakam Madhusudhan Reddy : టీడీపీ లేదా బీజేపీకి టికెట్ ఇచ్చి వైసీపీని గెలిపించొద్దు- జనసేన నేత కీలక వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు