Bihar Assembly Election 2025: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. తొలి దశ పోలింగ్‌కు సర్వం సిద్ధం..
3.75 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 1,314 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
Bihar Assembly Election 2025: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి దశ పోలింగ్ నేడు జరగనుంది. తొలి దశలో 121 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మహాఘట్ బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్, బీజేపీకి చెందిన ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి వంటి కీలక పోటీదారులు బరిలో ఉన్నారు. 3.75 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 1,314 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
తేజస్వి యాదవ్ (రఘోపూర్ నియోజకవర్గం) హ్యాట్రిక్ విజయంపై కన్నేశారు. ఆయనకు ప్రధాన ప్రత్యర్థి బిజెపికి చెందిన సతీష్ కుమార్. 2010లో జెడి(యు) టికెట్‌పై పోటీ చేసినప్పుడు యాదవ్ తల్లి రబ్రీ దేవిని ఈ నియోజకవర్గంలో ఓడించారు. జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ మొదట్లో యాదవ్‌కు పోటీగా బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపడంతో ఈ స్థానంలో పోటీ రసవత్తరంగా మారుతుందని అంతా భావించారు. అయితే, చివరికి కిషోర్ పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాడు. ఆయన పార్టీ చంచల్ సింగ్‌ను బరిలో నిలిపింది.
తొలి దశ పోలింగ్ లో ప్రముఖ నేతలు బరిలో ఉన్నారు. నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వంలోని అనేక మంది మంత్రులకు కూడా ముఖ్యమైనది. వీరిలో ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా ఉన్నారు. 45,341 బూత్‌లలో పోలింగ్ జరుగుతుంది. వీటిలో 36,733 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. మొత్తం ఓటర్ల సంఖ్య 3.75 కోట్లు. ఇందులో 10.72 లక్షల మంది కొత్తగా చేరిన ఓటర్లు. 18-19 ఏళ్ల వయస్సు గల ఓటర్ల సంఖ్య 7.38 లక్షలు.
ఎన్నికల కమిషన్ అంచనాల ప్రకారం ఈ నియోజకవర్గాల మొత్తం జనాభా దాదాపు 6.60 కోట్లు. దీని అర్థం సుమారు మూడు కోట్ల మంది మైనర్ వయస్సు లేదా ఇతర కారణాల వల్ల ఓటర్ల జాబితాలో చేర్చబడలేదు. రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. గెలుపుపై అన్ని పార్టీలు ధీమాగా ఉన్నాయి. విజయం మాదే అంటే మాదే అని ఊదరగొడుతున్నాయి.
