Parliament Session: పార్లమెంటులో ‘అదానీ కల్లోలం’.. ఉభయసభలూ సోమవారానికి వాయిదా

శుక్రవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే, రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ కేశవరావు అదానీ సంక్షోభంపై వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. బిలియనీర్ గౌతమ్ అదానీ కంపెనీల మోసం ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ లేదా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని డిమాండ్ ఆ తీర్మానంలో డిమాండ్ చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమై ఏప్రిల్ 6వతేదీ వరకు 66 రోజుల పాటు కొనసాగనున్నాయి.

Parliament Session: బిలియనీర్ అదానీ వివాదంపై పార్లమెంటు ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది. హిండెన్‭బర్గ్ రిపోర్ట్ మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ లేదా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేశారు. అదానీ గ్రూపులపై విచారణ డిమాండ్ చేస్తూ పార్లమెంటు లోపల విపక్ష పార్టీల నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బడ్జెట్ సమావేశాల ప్రశ్నోత్తరాల సమయం సందర్భంగా పార్లమెంటులో నెలకొన్ని ఈ గందరగోళం వల్ల ఉభయ సభలూ సోమవారానికి వాయిదా పడ్డాయి.

Mumbai : ముంబైలో మారణహోమం తప్పదంటూ ఈ మెయిల్ .. అప్రమత్తమైన ఎన్ఐఏ

శుక్రవారం పార్లమెంట్ ప్రారంభం కాగానే అదానీ గ్రూపులపై విచారణకు విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో మొదట లోక్‌సభ, రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. అనంతరం మళ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే విపక్ష నేతలు అదానీపై విచారణకు పట్టుబట్టారు. బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ 2023 ప్రవేశ పెట్టే సమయంలో సైతం అదానీ అంశాన్ని విపక్షాలు లేవనెత్తాయి.

Pakistan Economy: కీల‌క నిర్ణ‌యాలు తీసుకోనున్న పాక్.. అఖిల‌ప‌క్ష స‌మావేశానికి ఇమ్రాన్ కూ ఆహ్వానం

ఇక గురువారం నాటి సమావేశంలో కూడా అదానీ వ్యవహారమే కొనసాగడంతో సభ శుక్రవారానికి వాయిదా పడింది. ఇక శుక్రవారం కూడా అదే వివాదం కొనసాగింది. అదానీ వ్యవహారంపై ప్రభుత్వంపై ఉమ్మడి పోరు చేసేందుకు దేశంలోని పలు విపక్ష పార్టీలు గురువారం సమావేశం అయ్యాయి. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో, లక్షల కోట్ల అదానీ ఫ్రాడ్ (ఆరోపణలు) మీద చర్చకు పట్టుపట్టాని తీర్మానం చేసుకున్నాయి.

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీలో ఈటల, మంత్రి కేటీఆర్ మధ్య ఆసక్తికర సన్నివేశం..

ఇక శుక్రవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే, రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ కేశవరావు అదానీ సంక్షోభంపై వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. బిలియనీర్ గౌతమ్ అదానీ కంపెనీల మోసం ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ లేదా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని డిమాండ్ ఆ తీర్మానంలో డిమాండ్ చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమై ఏప్రిల్ 6వతేదీ వరకు 66 రోజుల పాటు కొనసాగనున్నాయి.

ట్రెండింగ్ వార్తలు