Pakistan Economy: కీలక నిర్ణయాలు తీసుకోనున్న పాక్.. అఖిలపక్ష సమావేశానికి ఇమ్రాన్ కూ ఆహ్వానం
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న పాకిస్థాన్ పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. తాజాగా పెషావర్ లో జరిగిన దాడులు, ఉగ్రమూకల వల్ల అంతర్జాతీయంగా దేశానికి జరుగుతున్న నష్టంతో ఉగ్రవాదంపై కూడా పాక్ తీరు కాస్త మారుతున్నట్లు కనపడుతోంది.

Pakistan Economy: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న పాకిస్థాన్ పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. తాజాగా పెషావర్ లో జరిగిన దాడులు, ఉగ్రమూకల వల్ల అంతర్జాతీయంగా దేశానికి జరుగుతున్న నష్టంతో ఉగ్రవాదంపై కూడా పాక్ తీరు కాస్త మారుతున్నట్లు కనపడుతోంది.
పాక్ ప్రధాన మంత్రి షెహబాబ్ షరీఫ్ ఫిబ్రవరి 7న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొనేందుకు మాజీ ప్రధాని, పీటీఐ ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్ ను కూడా ఆయన ఆహ్వానించడం గమనార్హం. ఆర్థిక వ్యవస్థ కుదేలు కావడం, రాజకీయ అస్థిరత వంటి వాటిపై ప్రధాని షరీఫ్ చర్చలు జరపనున్నారు.
వాటికి పరిష్కారం దిశగా నిర్ణయాలు తీసుకోనున్నారు. పాక్ ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యలపై అఖిలపక్ష సమావేశంలో చర్చిస్తామని పాక్ సమాచార శాఖ మంత్రి మర్రియం ఔరంగజేబ్ తెలిపారు. ఈ సమావేశంలో పోలీసు ఉన్నతాధికారులు, నిఘావర్గాల అధికారులు కూడా పాల్గొననున్నారని వివరించారు.
పాకిస్థాన్ ఎన్నడూ లేనంత ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అప్పులు కూడా దొరకకపోతుండడంతో ఆహార కొరత కూడా ఏర్పడుతోంది. ఇప్పటికే రేట్లు అంబరాన్నంటాయి. ఈ సమయంలో ఉగ్రవాదులు ఇటీవల పెషావర్ లో భీకరదాడి చేసి 100 మంది ప్రాణాలు తీశారు.
Mumbai : ముంబైలో మారణహోమం తప్పదంటూ ఈ మెయిల్ .. అప్రమత్తమైన ఎన్ఐఏ