IMD Latest Bulletin : బంగాళాఖాతంలో అల్పపీడనం.. పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ శనివారం వెల్లడించింది. ఈ అల్పపీడనం పశ్చిమ దిశగా కదిలే అవకాశం ఉందని దీన్ని ఫ్రభావం వల్ల తమిళనాడు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని ఐఎండీ తెలిపింది....

Low pressure

IMD Latest Bulletin : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ శనివారం వెల్లడించింది. ఈ అల్పపీడనం పశ్చిమ దిశగా కదిలే అవకాశం ఉందని దీన్ని ఫ్రభావం వల్ల తమిళనాడు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని ఐఎండీ తెలిపింది. భారీవర్షాల నేపథ్యంలో చెన్నై నగరంలో పాఠశాలలను మూసివేశారు.తమిళనాడులోని పలు జిల్లాల్లో శనివారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.

ALSO READ : Telangana Assembly Election 2023 : తుది దశకు చేరిన ఎన్నికల ప్రచారం…కాలనీ సంక్షేమ సంఘాలపై కేటీఆర్ కన్ను

పుదుచ్చేరి, కారైకల్‌లలో కూడా భారీవర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ అధికారులు వివరించారు. తమిళనాడులో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా బురద, కొండచరియలు విరిగిపడ్డాయి. తమిళనాడులోని ఇతర జిల్లాలతో పాటు చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టులో శనివారం ఉరుములతో పాటు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. భారీవర్షాల వల్ల ట్రాఫిక్ స్తంభించే పోయే అవకాశం ఉంది.

ALSO READ : Rapid Rail : తెలంగాణలో ర్యాపిడ్ రైలు ప్రతిపాదన… 2047 కేటీఆర్ హైదరాబాద్ విజన్

భారీ వర్షాల కారణంగా కూనూర్-మెట్టుపాళయం, కోటగిరి-మెట్టుపాళయం హైవేలు పదికి పైగా కొండచరియలు విరిగిపడటం వల్ల రోజువారీ వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. తమిళనాడు రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తమిళనాడు రెవెన్యూ మంత్రి కె. రాజన్‌ నేతృత్వంలో గురువారం సమావేశమై పరిస్థితిపై చర్చించారు.

ALSO READ : Hostages Released : యుద్ధం ప్రారంభమై రెండునెలల తర్వాత 24 మంది బందీలను విడుదల చేసిన హమాస్

రాష్ట్రంలో వర్షాల వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగలేదని, శబరిమల యాత్రికుల రాకపోకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని మంత్రి చెప్పారు. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్‌తో పాటు కేరళలోని ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో నవంబర్ 26, 27 తేదీల్లో మెరుపులతో కూడిన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు