Rapid Rail : తెలంగాణలో ర్యాపిడ్ రైలు ప్రతిపాదన… 2047 కేటీఆర్ హైదరాబాద్ విజన్

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ర్యాపిడ్ రైలు ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాకు అయినా గంట సమయంలోనే చేరుకునేలా 2047 హైదరాబాద్ విజన్ ప్రణాళిక రూపొందించినట్లు అధికార బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు వెల్లడించారు....

Rapid Rail : తెలంగాణలో ర్యాపిడ్ రైలు ప్రతిపాదన… 2047 కేటీఆర్ హైదరాబాద్ విజన్

Rapid Rail

Rapid Rail : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ర్యాపిడ్ రైలు ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాకు అయినా గంట సమయంలోనే చేరుకునేలా 2047 హైదరాబాద్ విజన్ ప్రణాళిక రూపొందించినట్లు అధికార బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు వెల్లడించారు. కేటీఆర్ తాజాగా 2047 హైదరాబాద్ విజన్ ప్రణాళికపై కేటీఆర్ తాజాగా ప్రజంటేషన్ ఇచ్చారు. హైదరాబాద్ నలుమూలలకు, ఓఆర్ఆర్ వరకు మెట్రోరైలులో చేరుకొని అక్కడి నుంచి ర్యాపిడ్ రైల్ ద్వారా కేవలం గంట సమయంలోనే జిల్లాలకు చేరుకునేలా వినూత్న ప్రణాళికను కేటీఆర్ రూపొందించారు.

రూపురేఖలు మారనున్న తెలంగాణ

ఘట్ కేసర్, ఓఆర్ఆర్ నుంచి బీబీనగర్, యాదాద్రి, జనగాం, రఘునాథపల్లి, స్టేషన్ ఘన్ పూర్, వరంగల్ నగరానికి 113 కిలోమీటర్ల దూరం ర్యాపిడ్ రైల్ ట్రాన్సిట్ కారిడార్ ను ప్రతిపాదించారు. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల నుంచి ఏడు మార్గాల్లో 792 కిలోమీటర్ల దూరం ర్యాపిడ్ రైలు కారిడార్ ప్రతిపాదనలు రూపొందించారు. గంటకు 140 నుంచి 160 కిలోమీటర్ల వేగం ర్యాపిడ్ రైలు ప్రయాణించనుంది. ఢిల్లీ నోయిడా మార్గాల్లో ప్రవేశపెట్టిన ర్యాపిడ్ రైలు తెలంగాణలోకి తీసుకురావాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రతిపాదించారు.

కేటీఆర్ విజన్ కు మేధావుల మద్ధతు

కేటీఆర్ తాజాగా వెల్లడించిన విజన్ కు సాఫ్ట్ వేర్, ఇంజనీర్లు, మేధావుల నుంచి మద్ధతు లభిస్తోంది. ఈ ర్యాపిడ్ రైలు కారిడార్ లు నిర్మిస్తే తెలంగాణ రూపురేఖలే మారుతాయని నిపుణులు చెబుతున్నారు. పెద్ద అంబర్ పేట ఓఆర్ఆర్ నుంచి చౌటుప్పల్, చిట్యాల్, నార్కట్ పల్లి, నక్రికేల్, సూర్యాపేట, కూసుమంచి, ఖమ్మం వరక 111 కిలోమీటర్ల దూరంలో ర్యాపిడ్ రైల్ నిర్మాణానికి ప్రతిపాదించారు. శంషాబాద్ ఓఆర్ఆర్ నుంచి షాద్ నగర్, జడ్చర్ల, మన్నెగూడ, వికారాబాద్ వరకు 50కిలోమీటర్ల దూరం కొత్త కారిడార్ నిర్మించనున్నారు.

ktr

ktr

ALSO READ : No non veg day : మాంస రహిత దినోత్సవం నేడు…ప్రభుత్వ అధికారిక ప్రకటన ఎందుకంటే…

అప్పా ఓఆర్ఆర్ జంక్షను నుంచి మొయినాబాద్, చేవేళ్ల, మన్నెగూడ, వికారాబాద్ వరకు 60కిలోమీటర్ల దూరం, ముత్తంగి ఓఆర్ఆర్ నుంచి ఇస్నాపూర్, సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్ వరకు 64 కిలోమీటర్ల కారిడార్, కండ్లకోయ ఓఆర్ఆర్ నుంచి మేడ్చల్, మనోహరాబాద్,మాసాయిపేట, చేగుంట, మెదక్ 70 కిలోమీటర్ల దూరం కారిడార్ నిర్మించాలని ప్రతిపాదించారు.

ALSO READ : Hostages Released : యుద్ధం ప్రారంభమై రెండునెలల తర్వాత 24 మంది బందీలను విడుదల చేసిన హమాస్

చేగుంట నుంచి రామాయంపేట, భిక్కనూర్, కామారెడ్డి, డిచ్ పల్లి, నిజామాబాద్ 108 కిలోమీటర్ల దూరం వరకు ర్యాపిడ్ రైలు కారిడార్ నిర్మాణానికి కేటీఆర్ ప్రతిపాదనలు రూపొందించారు. శామీర్ పేట ఓఆర్ఆర్ నుంచి గజ్వేల్, కొమరవెల్లి, సిద్ధిపేట, కరీంనగర్ వరకు 140 కిలోమీటర్ల దూరం ర్యాపిడ్ రైలు కారిడార్ ను ప్రతిపాదించారు.