పుదుచ్చేరిలో భారీ వర్షాలు, లెఫ్టినెంట్ గవర్నర్ తమిళి సై పర్యటన

పుదుచ్చేరిలో భారీ వర్షాలు, లెఫ్టినెంట్ గవర్నర్ తమిళి సై పర్యటన

Updated On : February 21, 2021 / 3:11 PM IST

Lt. Governor Dr. Tamilisai : పుదుచ్చేరిలో భారీ వర్షం కురిసింది. శివారు ప్రాంతాల్లో ఆదివారం ఉదయం ఏకధాటిగా వర్షం కురవడంతో చాలా ప్రాంతాలు జలమలమయ్యాయి. దాదాపు అన్ని రోడ్లు వరద నీటిలో మునిగిపోయాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రెయిన్ బో నగర్, కృష్ణా నగర్, బూమియన్ పేట, పవన నగర్ ప్రాంతాల్లో కుంభవృష్టిగా వర్షం కురిసింది. గత దశాబ్దకాలంలో ఇలాంటి వర్షం కురవ లేదని అధికారులు వెల్లడిస్తున్నారు. భారీగా వర్షం కురవడంతో జనజీవనం పూర్తిగా స్థంభించిపోయంది. భారీగా వర్షం పడడంతో ఫుడ్ డెలివరీ సంస్థలైన Swiggy, Zomato డెలివరీ సేవలను కొన్ని గంటల పాటు నిలిపివేశాయి. నిత్యావసర సరుకులు కొనడానికి ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు.

ఇదిలా ఉంటే…వర్షాల కారణంగా..ప్రభావితమైన ప్రాంతాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ తమిళి సై, సీఎం వి.నారాయణ స్వామి పర్యటించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు, సలహాలు అందచేశారు తమిళి సై. Dt. Collector Ms. Purva Garg and Special Secretary LG Mr. SD Sundaresan ఉన్నారు.