INDIA Alliance: దేశంలోని 26 విపక్షాల ‘ఇండియా’ కూటమిపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కళంకితులంతా కలిసి కూటమి కట్టారని ఆయన విమర్శించారు. ప్రధాని మోడీకి పెరిగిన మద్దతుకు భయపడే, కళంకిత అందరూ ఒక తాటిపైకి వచ్చారని ఆయన అన్నారు. అంతే కాకుండా బీజేపీకి వ్యతిరేకంగా ఏకమైన ప్రతిపక్షాల కూటమికి నాయకత్వమే లేదని ఎద్దేవా చేశారు. కూటమిలోని 26 పార్టీలు ఏ నాయకత్వంలో వెళ్తున్నాయో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
‘‘కళంకితులైన వారు ఒక చెట్టుపై కూర్చొని ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కానీ ఆ కూటమికి ‘వరుడు’ ఇంకా ఖరారు కాలేదు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో తెలియదు’’ అని శివరాజ్ అన్నారు. ఇక బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యవహారాన్ని ఆయన లేవనెత్తారు. బీజేపీ వ్యతిరేక వర్గానికి చెందిన ప్రముఖ నేత నితీశ్ అని చౌహాన్ పేర్కొన్నారు. కూటమికి ‘ఇండియా’ పేరు పెట్టడాన్ని ఆయన వ్యతిరేకించగా, ఆయన మిత్రపక్షమైన ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ మాత్రం మరో మార్గంలో వెళ్తున్నారని ఎద్దేవా చేశారు.
West Bengal : బెంగాల్‌లోనూ మణిపూర్ తరహా ఘటన…ఇద్దరు మహిళలను కొట్టి అర్ధనగ్నంగా ఊరేగించారు…
ప్రధాని మోదీ అధికారంలో ఉండేందుకు ప్రతిపక్షాలు భయపడుతున్నాయని శివరాజ్ సింగ్ చౌహాన్ తన ప్రసంగంలో అన్నారు. మోదీ అధికారంలో ఉంటే అందరికి అవినీతి వెలుగులోకి వస్తుందని, ఎవరినీ మోదీ వదిలిపెట్టబోరని విపక్షాలకు తెలుసని, అందుకే మోదీకి వ్యతిరేకంగా ఒక్కటయ్యారని అన్నారు.