West Bengal : బెంగాల్‌లోనూ మణిపూర్ తరహా ఘటన…ఇద్దరు మహిళలను కొట్టి అర్ధనగ్నంగా ఊరేగించారు…

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోనూ మణిపూర్ తరహా ఘటన శనివారం వెలుగుచూసింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని మాల్దాలో ఇద్దరు మహిళలను కొట్టి వారిని అర్ధనగ్నంగా ఊరేగిస్తున్న వీడియో తాజాగా వైరల్ అవుతోంది....

West Bengal : బెంగాల్‌లోనూ మణిపూర్ తరహా ఘటన…ఇద్దరు మహిళలను కొట్టి అర్ధనగ్నంగా ఊరేగించారు…

Malda incident

West Bengal : పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోనూ మణిపూర్ తరహా ఘటన శనివారం వెలుగుచూసింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని మాల్దాలో ఇద్దరు మహిళలను కొట్టి వారిని అర్ధనగ్నంగా ఊరేగిస్తున్న వీడియో తాజాగా వైరల్ అవుతోంది. మాల్దా జిల్లా పకువాహాట్‌ గ్రామంలో వెలుగుచూసిన వీడియోలో ఇద్దరు మహిళలను కొట్టడం, వారిని అర్ధనగ్నంగా ఊరేగించడం కనిపిస్తోంది. (After Manipur)

Seema,Sachin Love story : సీమా, సచిన్‌లకు అస్వస్థత…భారత పౌరసత్వం కల్పించాలని రాష్ట్రపతికి లేఖ

ప్రాథమిక నివేదికల ప్రకారం ఈ సంఘటన మూడు నాలుగు రోజుల క్రితం జరిగింది. మాల్దాలోని పకువాహాట్‌లో స్థానికులు దొంగతనం చేశారనే అనుమానంతో ఇద్దరు మహిళలను పట్టుకుని కొట్టారు. (2 women beaten, paraded half naked in Malda) ఇద్దరు మహిళలపై పలువురు మహిళలు దాడి చేసినట్లు వీడియోలో కనిపించింది. అయితే ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ పోలీసులకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు.

IMD Issues Red Alert : వచ్చే ఐదు రోజులపాటు పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు..ఐఎండీ రెడ్ అలర్ట్

ఈ వీడియో తమ దృష్టికి వచ్చిన తర్వాతే విషయం తెలిసిందని పోలీసులు తెలిపారు. ప్రాథమిక విచారణలో ఇద్దరు మహిళలు దొంగతనానికి పాల్పడుతుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారని వెల్లడైంది. ఆ తర్వాత స్థానిక మహిళా దుకాణాదారులు వారిని కొట్టారని తేలింది. ఘటన అనంతరం వారిని పట్టుకున్న మహిళలు కూడా పారిపోయారు. మహిళలను కొట్టిన వారు భయంతో ఫిర్యాదు చేసేందుకు వెనుకాడుతున్నారు.