Covid-19 Curbs : జనవరి 31 వరకు కొవిడ్ ఆంక్షలు పొడిగింపు.. స్కూళ్లు బంద్!

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. మధ్యప్రదేశ్‌లోనూ కరోనా కేసుల తీవ్రత పెరిగిపోతుంది.

Covid-19 Curbs in Madhya Pradesh : దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. మధ్యప్రదేశ్‌లోనూ కరోనా కేసుల తీవ్రత పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల మూసివేతను జనవరి 31వరకు పొడిగించింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా జనవరి 15 నుంచి జనవరి 31 వరకు ఒకటో తేదీ నుంచి 12వ తేదీ వరకు అన్ని స్కూళ్లు మూతపడనున్నాయి. రాష్ట్రంలో కొవిడ్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయని, వాణిజ్య లేదా మతపరమైన ఉత్సవాలు అన్ని రకాల జాతరలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఊరేగింపు ర్యాలీ, రాజకీయ లేదా సామాజిక సమావేశాలపై కూడా నిషేధం విధించినట్టు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.

కోవిడ్-19 మార్గదర్శకాలివే…
ఇండోర్ కార్యక్రమాలకు 50శాతం హాజరు మాత్రమే ఉండాలని కొవిడ్ మార్గదర్శకాల్లో పేర్కొంది. రాజకీయ, మత, విద్యా, వినోద కార్యక్రమాలు మొదలైనవన్నీ బహిరంగంగా నిర్వహిస్తే, గరిష్ట సంఖ్య 2500 వరకు హాజరుకావొచ్చునని తెలిపింది. పెద్ద ర్యాలీలు, పెద్ద సమావేశాలు, పెద్ద ఈవెంట్‌లపై నిషేధం కొనసాగుతుందని తెలిపింది. అన్ని క్రీడా కార్యకలాపాలు ప్రేక్షకులు లేకుండానే నిర్వహించనున్నారు. జనవరి 20 నుంచి ప్రీ-బోర్డు పరీక్షలు నిర్వహించాలని ప్రతిపాదించగా, ఆ పరీక్షలను టేక్‌హోమ్ ఎగ్జామ్స్‌గా నిర్వహించాలని సీఎం ప్రకటించారు.

కోవిడ్-19 బాధితుల్లో కేవలం 3.3 శాతం మంది మాత్రమే ఆస్పత్రుల్లో చేరారు. ఒమిక్రాన్ వ్యాప్తిపై ప్రజలు ఆందోళణ చెందాల్సిన అవసరం లేదన్నారు. కానీ అజాగ్రత్తగా ఉండొద్దని సూచించారు. కరోనా ఒమిక్రాన్ వేవ్‌ సమయంలో హోమ్ ఐసోలేషన్ చాలా ప్రాధానమైనదిగా పేర్కొంది. ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.

మధ్యప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య గురువారం 4,031 కరోనా కేసులు నమోదు కాగా.. కేసుల సంఖ్య 8,14,473కు పెరిగింది, మరో ముగ్గురు బాధితులు మరణించడంతో కరోనా మరణాల సంఖ్య 10,543కు పెరిగిందని ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు. రాష్ట్రంలో 3,639 కరోనావైరస్ కేసులు నమోదవగా, రాష్ట్ర పాజిటివిటీ రేటు గురువారం 4.5 శాతం నుంచి 5.1 శాతానికి చేరుకుంది. రోజులో 782 మంది ఆస్పత్రుల్లో నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కోలుకున్న వారి సంఖ్య 7,86,278 మందికి చేరుకుంది.

Read Also : Yogi : ఎన్నికల వేళ.. దళిత కుటుంబంతో సీఎం యోగి లంచ్

ట్రెండింగ్ వార్తలు