Ujjain : మ‌హాకాళేశ్వ‌రుడి ఆలయం వ‌ద్ద తొక్కిస‌లాట..

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు మహిళలు, చిన్నారులు గాయపడ్డారు. శ్రావణమాసం తొలి సోమవారం సందర్భంగా మహాకాలేశ్వరుణ్ణి దర్శించుకునేందుకు వచ్చిన వీఐపీలతో పాటు సామాన్య భక్తులు కూడా ఒకేసారి చొచ్చుకురావడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో పరిస్థితి అదుపుతప్పింది. ఒకరిమీద మరొకరు పడిపోయారు. భక్తుల తోపులాటలో బారికేడ్లు కూడా విరిగిపోయాయి.

ujjain Mahakaleswara temple stampede : మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు మహిళలు, చిన్నారులు గాయపడ్డారు. మహాకాలేశ్వరుణ్ణి దర్శించుకునేందుకు వచ్చిన వీఐపీలతో పాటు సామాన్య భక్తులు కూడా ఒకేసారి చొచ్చుకురావడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో పరిస్థితి అదుపుతప్పింది. ఒకరిమీద మరొకరు పడిపోయారు. భక్తుల తోపులాటలో బారికేడ్లు కూడా విరిగిపోయాయి. కోవిడ్ నిబందనల్ని కూడా అధికారులు పట్టించుకోలేదు. అధిక సంఖ్యలో భక్తులు తరలిరావటంతో తోపులాట జరగటంతో తొక్కిసలాట చోటుచేసుకుంది.

శ్రావణమాసం తొలి సోమవారం సందర్భంగా సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌తో పాటుమాజీ ముఖ్యమంత్రి ఉమాభారతితోపాటు పలువురు వీఐపీలు ఆలయ సందర్శనకు వచ్చారు. దీంతో సామాన్య భ‌క్తుల‌ను కాసేపు ఆపాల్సి వ‌చ్చింది. అయితే ఆ స‌మ‌యంలో ఆల‌యం బ‌య‌ట తొక్కిస‌లాట జ‌రిగింది. నాలుగవ గేటు వ‌ద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు అధికారులు వెల్లడించారు.

జ్యోతిర్లింగ క్షేత్ర‌మైన ఉజ్జ‌యినిలో ఆల‌య ద‌ర్శ‌నం కోసం అనుమ‌తి క‌ల్పించారు. సింగిల్ డోసు టీకా వేసుకున్న వాళ్ల‌కి, ఆర్‌టీ పీసీఆర్ నెగ‌టివ్ రిపోర్ట్ ఉన్న‌వాళ్లు మ‌హాకాలేశ్వ‌రుడిని ద‌ర్శించుకోవ‌చ్చు. అయితే ఇవాళ వీఐపీల తాకిడి ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో.. భ‌క్తులు ఒక్క‌సారిగా విరుచుకుప‌డ్డారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవటంతో ఆలయ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఈ ఘటనలో పలువురు పోలీసులు కూడా గాయపడటం గమనించాల్సిన విషయం.

ట్రెండింగ్ వార్తలు