Women Engineer Dies : కరోనా కాటు..ఊపిరి ఆడక​ కారులోనే ప్రాణాలు కోల్పోయిన మహిళా ఇంజనీర్ !

Woman Engineer Dies of Covid : కరోనా కాటు పడిందంటే ఊపిరి ఆడక ప్రజల పాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. ఆస్పత్రి వెళితే..బెడ్ దొరకదు. ఆక్సిజన్ అందలేదు..దీంతో కారులోనే ఓ యువ ఇంజనీర్ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఉత్తరప్రదేశ్ నోయిడాలోని జిమ్స్ ఆసుపత్రిలో జరిగిన విషాదం ఇది. 35 ఏళ్ల మహిళా ఇంజనీర్ ప్రాణవాయువు అందక ప్రాణాలు విడిచింది. ఆమెకు తోడుగా వచ్చిన వ్యక్తి బెడ్ కోసం ఆసుపత్రి సిబ్బందిని ఎంత బతిమాలినా బెడ్లు లేవన్న సమాధానమే వచ్చింది. దీంతో ఆమె ఊపిరి ఆడక తల్లడిల్లిపోతుంటే కనీసం ఆక్సిజన్ అయినా పెట్టమని బతిమాలినా అదే సమాధానం.

మహిళా ఇంజనీర్ జాగృతి గుప్తా సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్. ఆమె భర్త పిల్లలు సొంత మధ్యప్రదేశ్ లోనే ఉంటుండగా.. వృత్తి రీత్యా ఇంజనీర్ అయిన ఆమె నోయిడాలో ఉద్యోగం చేస్తున్నారు. ఈక్రమంలో జాగృతి కరోనా సోకి తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆమె యజమాని గురువారం (ఏప్రిల్ 29) ఆసుపత్రికి తీసుకొచ్చారు. కానీ ఆస్పత్రిలో బెడ్లు లేవని చెప్పటంతో జాగృతిని కారులోనే ఉంచి ఆస్పత్రి సిబ్బందిని బతిమిలాడిని బెడ్లు లేవనే సమాధానం చెప్పారు. ఇంతలో జాగృతికి ఊపిరి ఆడక గిలగిలలాడిపోయింది. కనీసం ఆక్సిజన్ అయినా పెట్టమని బ్రతిమిలాడిని ఆక్సిజన్ లేదు అనే సమాధానం.

దీంతో దాదాపు 3 గంటల పాటు ఊపిరాడక సతమతమైపోయి..ఆమె ఆస్పత్రి పార్కింగ్ ప్లేసులో ఉన్న కారులోనే జాగృతి మధ్యాహ్నం 3.30గంటలకు కారులోనే ప్రాణాలు వదిలింది. అప్పటి వరకూ డాక్టర్లను. ఆస్పత్రి సిబ్బందిని వేడుకున్నా..చివరకు జాగృతి స్పృహ తప్పి పడిపోయిన తర్వాతే డాక్టర్లు ఆమె వద్దకొచ్చి చూశారు. కానీ అప్పటికే ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. గురువారం జరిగిన ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ట్రెండింగ్ వార్తలు