New Project
Kangana Ranaut: రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ శ్రీ అవార్డు అందుకున్న కంగనా రనౌట్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ తిట్టిపోస్తున్నారు. గతంలో సోషల్ మీడియా వేదికగా చేస్తున్న కామెంట్లకు ఫలితంగా వాట్సాప్, ట్విట్టర్ లాంటి ప్రముఖ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లు ఆమెను బ్యాన్ చేశాయి. ఇటీవల జరిగిన పద్మఅవార్డుల ప్రధానం తర్వాత మాట్లాడిన ఆమె.. దేశ శత్రువులపై తాను చేసిన పోరాటాన్ని భారత ప్రభుత్వం గుర్తించినందుకు గర్వపడుతున్నానని ఆ వీడియోలో పేర్కొంది.
ఈ వివాదస్పద వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ఫైర్ అయ్యారు. భారత్‌కు అసలైన స్వాతంత్ర్యం 2014 లో వచ్చిందని, 1947లో లభించింది కేవలం భిక్ష మాత్రమేనని చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని అన్నారు. భారత్‌కు 1947లో స్వాతంత్ర్యం రాలేదని , అది బ్రిటీష్ వాళ్లు పెట్టిన భిక్ష అని , నిజమైన స్వాతంత్ర్యం 2014లో దేశప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టాకే అసలు స్వాతంత్ర్యం వచ్చిందని కంగనా చేసిన వ్యాఖ్యలు రచ్చ రేపుతున్నాయి.
कभी महात्मा गांधी जी के त्याग और तपस्या का अपमान, कभी उनके हत्यारे का सम्मान, और अब शहीद मंगल पाण्डेय से लेकर रानी लक्ष्मीबाई, भगत सिंह, चंद्रशेखर आज़ाद, नेताजी सुभाष चंद्र बोस और लाखों स्वतंत्रता सेनानियों की कुर्बानियों का तिरस्कार।
इस सोच को मैं पागलपन कहूँ या फिर देशद्रोह? pic.twitter.com/Gxb3xXMi2Z
— Varun Gandhi (@varungandhi80) November 11, 2021
దేశ స్వాంతంత్ర్యం కోసం కష్టపడ్డ మహత్మాగాంధీజీ, నేతాజీ, జవహర్‌లాల్ నెహ్రూ, భగత్‌సింగ్, లక్ష్మీ బాయి, మంగళ్ పాండే, చంద్రశేఖర్ ఆజాద్, వంటి ఎందరో మహానుభావుల త్యాగాలను కించపరిచే విధంగా మాట్లాడటాన్ని పిచ్చితనం అనాలా? దేశద్రోహం అనాలా అంటూ తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు.
……………………………………… : ఓ ట్విటర్ పోస్టు.. ఆర్టీసీ చార్జీలు తగ్గించింది
‘మహాత్మా గాంధీ త్యాగాన్ని కొన్నిసార్లు అవమానించడం, కొన్నిసార్లు అతని హంతకుడిని ప్రశంసించడం, ఇప్పుడు స్వాతంత్ర్య సమరయోధులైన మంగళ్ పాండే, రాణీ లక్ష్మీబాయి, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి లక్షలాది మంది త్యాగాలను తృణీకరించడం వంటివి చేస్తుంది. ఈ ఆలోచనను పిచ్చిగా పిలుస్తారా, లేదా దేశద్రోహం అని అనుకోవాలా?” అంటూ రెస్పాండ్ అయ్యారు.