Shinde Govt: ‘హలో’ కాదు ‘వందేమాతరం’.. ఇలాగే అనాలంటూ మహరాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు

ప్రస్తుతం ప్రభుత్వ అధికారుల విషయంతో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల క్ర‌మంగా ప్ర‌జ‌ల్లో కూడా చైత‌న్యం తీసుకొచ్చి జాతీయ‌తా భావాల‌ను పెంపొందేలా చూడాల‌ని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు. హ‌లో అనే ప‌దం ప‌శ్చిమ దేశాల‌కు సంబంధించిన‌ద‌ని, హ‌లో అని పిల‌వ‌డం వ‌ల‌న ఎలాంటి ఉపయోగం లేద‌ని, ఆప్యాతానురాగాలు, జాతీయ‌తా భావాలు వెల్లివిరియాలంటే వందే మాత‌రం అని పిల‌వాల‌ని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది.

Shinde Govt: మహారాష్ట్రలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇక నుంచి హలో అనే మాటకు బదులు వందేమాతరం అని వినిపించనుంది. ఏక్‭నాథ్ షిండే ఇచ్చిన ఈ ఆదేశాలు ఈరోజు నుంచే అమలులోకి రానున్నాయి. ఫోన్‭లో అయినా, నేరుగా కలుసుకున్నా.. కింది స్థాయి నుంచి ఉన్నత అధికారుల వరకు అందరూ ఇక నుంచి హలో అనడానికి బదులు వందేమతరం అని ఒకరినొకరు పలకరించుకోవాలని తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

అయితే ప్రస్తుతం ప్రభుత్వ అధికారుల విషయంతో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల క్ర‌మంగా ప్ర‌జ‌ల్లో కూడా చైత‌న్యం తీసుకొచ్చి జాతీయ‌తా భావాల‌ను పెంపొందేలా చూడాల‌ని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు. హ‌లో అనే ప‌దం ప‌శ్చిమ దేశాల‌కు సంబంధించిన‌ద‌ని, హ‌లో అని పిల‌వ‌డం వ‌ల‌న ఎలాంటి ఉపయోగం లేద‌ని, ఆప్యాతానురాగాలు, జాతీయ‌తా భావాలు వెల్లివిరియాలంటే వందే మాత‌రం అని పిల‌వాల‌ని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది.

ఇక షిండే ప్రభుత్వాని కంటే ముందే మహారాష్ట్ర అటవీ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అటవీ శాఖలోని అధికారులు, సిబ్బంది అందరూ విధుల్లో ఉన్న సమయంలో పౌరులు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌ను తీసుకునేటప్పుడు హలోకు బదులుగా వందేమాతరం అని అని చెప్పాలని అటవీ శాఖ జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు.

Uddhav Thackeray: ఉద్ధవ్‌కు బిగ్ షాక్.. షిండే క్యాంపులో చేరిన 3,000 మంది శివసేన కార్యకర్తలు

ట్రెండింగ్ వార్తలు