Uddhav Thackeray: ఉద్ధవ్‌కు బిగ్ షాక్.. షిండే క్యాంపులో చేరిన 3,000 మంది శివసేన కార్యకర్తలు

మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రేకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన తనయుడు ఆదిత్య థాక్రే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి చెందిన 3,000 మంది కార్యకర్తలు షిండే క్యాంపులో చేరారు.

Uddhav Thackeray: ఉద్ధవ్‌కు బిగ్ షాక్.. షిండే క్యాంపులో చేరిన 3,000 మంది శివసేన కార్యకర్తలు

Uddhav Thackeray: ఇప్పటికే అధికారాన్ని కోల్పోయి, పార్టీ చేజారిపోయే పరిస్థితిలో ఉన్న శివసేన నేత, మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రేకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ముంబైలోని వర్లి ప్రాంతానికి చెందిన 3,000 మంది శివసేన కార్యకర్తలు షిండే క్యాంపులో చేరిపోయారు.

Chiranjeevi : రాజమౌళితో నేను సినిమా చేయను.. నేనే దర్శకుడిగా మారుతాను..

ఆదివారం జరిగిన కార్యక్రమంలో వీళ్లంతా షిండే వర్గంలో చేరారు. ఇది ఉద్ధవ్ థాక్రేకు, ఆయన తనయుడు ఆదిత్య థాక్రేకు ఎదురుదెబ్బ అనే చెప్పాలి. దసరా సందర్భంగా ఇక్కడ భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఉద్ధవ్, ఆదిత్య థాక్రే ఏర్పాట్లు చేస్తున్న తరుణంలోనే కార్యకర్తలు పార్టీని వీడారు. ఇటీవలే ఈ ర్యాలీకి బాంబే హైకోర్టు అనుమతి కూడా మంజూరు చేసింది. అన్నింటికీ మించిన కీలకమైన విషయం.. వర్లి ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉన్నది ఆదిత్య థాక్రే. తన సొంత నియోజకవర్గంలోనే ఆదిత్య కార్యకర్తల్ని కాపాడుకోలేకపోయారు. దీంతో ఈ పరిణామం వారికి మరింత ఆందోళన కలిగిస్తుంది. ఇక కొంతకాలం క్రితం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఉద్ధవ్ థాక్రే సీఎం పదవి కోల్పోయిన సంగతి తెలిసిందే.

Chiranjeevi : బలివ్వడానికి గొర్రెను తీసుకువెళ్లినట్టు పెళ్లికి సిద్ధం చేశారు.. చిరిగిన షర్ట్‌తోనే సురేఖకి తాళి కట్టా..

శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల మద్దతుతో ఏక్‌నాథ్ షిండే సీఎంగా పదవీస్వీకారం చేశారు. అనంతరం చాలా మంది ఎమ్మెల్యేలు షిండే క్యాంపులో చేరారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పార్టీ ఎవరికి దక్కుతుంది అనే అంశంలో సందిగ్ధత నెలకొంది. షిండే.. ఉద్ధవ్‌లలో పార్టీ ఎవరికి కేటాయించాలి అనే అంశంపై ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోనుంది.