Maharashtra: మహారాష్ట్రలో ఒక్కరోజే 12వేలకు చేరిన కరోనా కేసులు

కరోనా మరోసారి దేశవ్యాప్తంగా చెలరేగిపోతుంది. మహారాష్ట్రలో ఒక్క ఆదివారం రోజే రికార్డు స్థాయిలో 11వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కాగా, ఒమిక్రాన్ పేషెంట్లు 50మంది ఉన్నట్లుగా రికార్డులు.

Corona Cases (5)

Maharashtra: కరోనా మరోసారి దేశవ్యాప్తంగా చెలరేగిపోతుంది. మహారాష్ట్రలో ఒక్క ఆదివారం రోజే రికార్డు స్థాయిలో 11వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కాగా, ఒమిక్రాన్ పేషెంట్లు 50మంది ఉన్నట్లుగా రికార్డులు చెబుతున్నాయి. మహారాష్ట్ర గవర్నమెంట్ వెల్లడించిన లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 11వేల 877 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలుస్తుంది.

ఫలితంగా మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 510కి చేరింది. ఆదివారం డేటాను పరిశీలిస్తే కరోనా కారణంగా 9 మంది ప్రాణాలు కోల్పోగా.. 2వేల 69 మంది రికవరీ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 42వేల 24 యాక్టివ్ కేసులు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఒక్కముంబైలోనే 29వేల 819 కేసులు నమోదుకావడం గమనార్హం.

శనివారం మహారాష్ట్రలో నమోదైన కేసుల్లో ఆరు కేసులు పూణె నుంచి వచ్చినవే.

ఇది కూడా చదవండి.. ఆ రెండ్రోజులు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు

కేరళలో ఆదివారం 45 ఒమిక్రాన్ కేసులు నమోదుకాగా, రాష్ట్రంలో ఒమిక్రాన్ బారిన పడిన వారి సంఖ్య 152కి చేరింది. దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ బాధితుల సంఖ్య వెయ్యి 525కి చేరింది. దేశంలోని 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో ఒమిక్రాన్ కొత్త కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీరిలో 560 మంది రికవరీ అయ్యారని తెలిపింది.