covid-19 :‘మహా’మ్మారి..ఆ రాష్ట్రంలో 30రోజుల్లో 17.46 లక్షల మందికి కరోనా..!

మహారాష్ట్రలో కరోనా సునామీని తలపించేలా చేస్తోంది. గత ఏప్రిల్ 1నుంచి 30 వరకూ 17లక్షలకుపైగా ప్రజలు కరోనా బారినపడ్డారు. ప్రతీ రోజు 50 వేలమందికి పాజిటివ్ నిర్ధారణ అవుతోంది. దీంతో దేశంలోనే మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య ఏ రేంజ్ లో పెరుగుతుందో ఊహించుకుంటేనే ప్రాణాలు హడలిపోతున్నాయి. ఒక్క ఏప్రిల్‌ నెలలోనే 17.46 లక్షల మంది కరోనా బారినపడ్డారు.

Maharashtra 17.46 Lakh Positive Cases In Apri

Maharashtra 17.46 lakh positive cases  : మహారాష్ట్రలో కరోనా మహోగ్రరూపం చూపిస్తోంది. ఏకంగా సునామీని తలపించేలా చేస్తోంది. గత ఏప్రిల్ 1నుంచి 30 వరకూ 17లక్షలకుపైగా ప్రజలు కరోనా బారినపడ్డారు. ఈక్రమంలో ప్రతీ రోజు 50 వేలమందికి పాజిటివ్ నిర్ధారణ అవుతోంది. దీంతో దేశంలోనే మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య ఏ రేంజ్ లో పెరుగుతుందో ఊహించుకుంటేనే ప్రాణాలు హడలిపోతున్నాయి. ఒక్క ఏప్రిల్‌ నెలలోనే 17.46 లక్షల మంది కరోనా బారినపడ్డారు.

ఏప్రిల్ 1 నుంచి 30 వరకు మొత్తం 17,46,309 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఏప్రిల్‌ 1న 28,56,163గా ఉన్న పాజిటివ్‌ కేసుల సంఖ్య నెలాఖరు నాటికి 46,02,472 చేరింది. కాగా, గతేడాది సెప్టెంబర్‌ 16న మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 10,97,856 ఉన్నది. అది ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నాటికి 28,56,163కు పెరిగింది. అంటే కేవలం 196 రోజుల్లోనే 17 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అధికారికంగానే ఇన్ని కేసులు నమోదు అయితే అనధికారికంగా ఇంకా ఎన్ని కేసులు ఉండి ఉంటాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

రాష్ట్రంలో కరోనా రెండోసారి విజృంభించడంతో కేవలం 30 రోజుల్లోనే 17.46 కేసులు రికార్డవడం విశేషం. అదేవిధంగా గత 167 రోజుల్లో కరోనాతో 14,039 మంది మృతిచెందారు. కేసులు భారీగా నమోదవుతుండటంతో ప్రభుత్వం టెస్టుల సంఖ్యను కూడా రెట్టింపు చేసింది. ఏప్రిల్‌ నెలలో మొత్తం 1,99,75,341 నమూనాలను పరీక్షించింది.