Eknath Shinde
మహారాష్ట్ర శాసనసభలోని 288 స్థానాలకు నవంబర్ 20న ఎన్నికలు జరగాల్సిన వేళ మహాయుతి కూటమి నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న ప్రశ్న తలెత్తుతోంది. దీనిపై ఏక్‌నాథ్ షిండే ఇవాళ స్పందించారు.
సీఎం అభ్యర్థి ఎవరని ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ… తమ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి పాటుపడిందని, ప్రజల జీవనశైలిలో మార్పు తీసుకొచ్చిందని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల షేర్ శివసేన పార్టీ వైపునకు మళ్లిందని తెలిపారు.
ఈ ఎన్నికల్లో కూడా అదే పునరావృతం అవుతుందని షిండే అన్నారు. తమ టీమ్‌లో తానే టీమ్ లీడర్‌నని తెలిపారు. అలాగే, తమ టీమ్‌లో అందరూ సమానమేనని కూడా చెప్పుకొచ్చారు. మహాయుతి ప్రభుత్వాన్ని తీసుకురావడమే తమ లక్ష్యమని చెప్పారు. ఉద్ధవ్ థాక్రే వ్యక్తిగత ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీతో కలిశారని తెలిపారు.
బారామతి, వర్లీ అసెంబ్లీ స్థానాల గురించి ఏక్‌నాథ్ షిండే మాట్లాడుతూ.. ఎన్నికలు ఎన్నికల మాదిరిగానే జరుగుతాయని అన్నారు. తాము ఎవరినీ బలహీనంగా భావించడం లేదని, ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా తాము చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ ప్రజల ముందుకు వెళ్తామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పని చేసే వారికే ప్రజలు అండగా నిలుస్తారని చెప్పారు.
ఎమ్మెల్యే గడ్డం వినోద్ ను కలిసిన లేడీ అఘోరీ తల్లిదండ్రులు.. ఎందుకో తెలుసా..