ఎమ్మెల్యే గడ్డం వినోద్ ను కలిసిన లేడీ అఘోరీ తల్లిదండ్రులు.. ఎందుకో తెలుసా..

అంతేకాదు పోలీస్ ప్రొటక్షన్ కోసం ఏసీపీకి ఆదేశాలు ఇచ్చారు ఎమ్మెల్యే వినోద్.

ఎమ్మెల్యే గడ్డం వినోద్ ను కలిసిన లేడీ అఘోరీ తల్లిదండ్రులు.. ఎందుకో తెలుసా..

Lady Aghori (Photo Credit : Google)

Updated On : November 2, 2024 / 2:11 AM IST

Aghori Parents : మహిళా అఘోరీ తల్లిదండ్రులు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ను కలిశారు. కుశ్నపల్లిలోని తమ ఇంటి వైపునకు మీడియా రాకుండా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. కాగా, ఆత్మ బలిదానాలు చేసుకోవద్దని అఘోరీ తల్లిదండ్రులకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ చెప్పారు. సమస్యను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానంటూ భరోసా ఇచ్చారు. అంతేకాదు పోలీస్ ప్రొటక్షన్ కోసం ఏసీపీకి ఆదేశాలు ఇచ్చారు ఎమ్మెల్యే వినోద్.

లేడీ అఘోరి నాగసాధువు వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. సామాజిక మాధ్యమాలలో అఘోరి వీడియోలు వైరల్ గా మారాయి. రాష్ట్రంలో ఆలయాలను అఘోరి సందర్శిస్తూ వస్తోంది. ఇదే క్రమంలో ఇటీవల అఘోరి సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. నవంబర్ 1వ తేదీన ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం దగ్గర లోక కల్యాణం కోసం ఆత్మార్పణ చేసుకుంటానని ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది.

ఆత్మార్పణ చేసుకుంటానన్న అఘోరి ప్రకటనతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అఘోరిని అదుపులోకి తీసుకున్నారు. సొంత గ్రామం మంచిర్యాల జిల్లా నన్నెల మండలం కుశ్నపల్లికి భారీ భద్రత మధ్య తరలించారు. అనంతరం అఘోరీని తల్లిదండ్రులకు అప్పగించారు.

Also Read : టీటీడీపీపై దృష్టి సారించిన చంద్రబాబు.. టీటీడీపీ అధ్యక్షుడిగా బాబూమోహన్‌?