Redmi Turbo 6 Series : చార్జింగ్ టెన్షన్‌కు గుడ్‌బై.. 10,000mAh బ్యాటరీతో కొత్త రెడ్మి టర్బో 6 సిరీస్ వచ్చేస్తోంది..!
Redmi Turbo 6 Series : రెడ్మి టర్బో 6 మ్యాక్స్‌లో 2K డిస్ప్లే ఉంటుందని అంచనా. మెటల్ ఫ్రేమ్‌తో వస్తుందని భావిస్తున్నారు. రెడ్మి టర్బో 6 మ్యాక్స్ మీడియాటెక్ డైమెన్సిటీ 9600s ప్రాసెసర్‌తో రన్ అవుతుందని అంచనా.

Redmi Turbo 6 Series : షావోమీ సబ్-బ్రాండ్ రెడ్మి నుంచి అతి త్వరలో సరికొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ రాబోతుంది. ఈ సిరీస్‌లో రెడ్మి టర్బో 6, రెడ్మి టర్బో 6 మ్యాక్స్ అనే 2 మోడళ్లు ఉంటాయని అంచనా. ఈ స్మార్ట్ఫోన్లకు సంబంధించి ఫీచర్ల వివరాలు లీక్ అయ్యాయి.. అవేంటో ఓసారి చూద్దాం..

టిప్‌స్టర్ ప్రకారం.. రెడ్మి టర్బో 6 సిరీస్ 7-అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్ఫోన్లు పవర్ఫుల్ 10,000mAh బ్యాటరీతో రావొచ్చు. అయితే, ఈ స్మార్ట్ఫోన్లలో వేర్వేరు ప్రాసెసర్లు ఉండొచ్చు. రెడ్మి టర్బో 6 మీడియాటెక్ డైమెన్సిటీ 8 సిరీస్ చిప్సెట్ ఉండొచ్చు. అలాగే, రెడ్మి టర్బో 6 మ్యాక్స్ మీడియాటెక్ డైమెన్సిటీ 9 సిరీస్ చిప్సెట్తో రానుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్ స్టాండర్డ్ మోడల్లో రాబోయే మీడియాటెక్ డైమెన్సిటీ 8600 చిప్సెట్ ఉండవచ్చు. రెడ్మి టర్బో 6 మ్యాక్స్‌లో 2K డిస్ప్లే మెటల్ ఫ్రేమ్ ఉండొచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 9600s ప్రాసెసర్ ఉండొచ్చు. సేఫ్టీ కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉండొచ్చు.

రెడ్మి టర్బో 5 ఫోన్ గత నెలలో భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.59-అంగుళాల 1.5K ఫ్లూయిడ్ డిస్ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 480Hz టచ్ శాంప్లింగ్ రేట్, HDR10+, డాల్బీ విజన్ సపోర్ట్ 3,500 నిట్స్ టాప్ బ్రైట్నెస్ లెవల్ అందిస్తుంది.

ఈ డిస్ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్ఓఎస్ 3పై రన్ అవుతుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా చిప్సెట్తో వస్తుంది.

రెడ్మి టర్బో 5 డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్లో 50MP ప్రైమరీ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 20MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 7,540mAh బ్యాటరీతో వస్తుంది. 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. థర్మల్ మేనేజ్మెంట్ కోసం ఇందులో 3D ఐస్-లూప్ కూలింగ్ సిస్టమ్ ఉంది.
