Bigg Boss Weekend Episode : అగ్నిపరీక్ష బ్యాచ్ కి చుక్కలు చూపించిన నాగార్జున.. ఏడ్చేసిన అపూర్వ, ఝాన్సీ, షాలిని.. బిగ్ బాస్ 10 డే 34 ఎపిసోడ్..
మొత్తానికి ఇవాళ ఎపిసోడ్ లో నాగార్జున అగ్నిపరీక్ష బ్యాచ్ చేసే గ్రూపిజం, ఓవర్ యాక్షన్ బయటపెట్టి వాళ్లకు షాక్ ఇచ్చారు. (Bigg Boss Weekend Episode)
Bigg Boss Weekend Episode
Bigg Boss Weekend Episode : నేడు శనివారం వీకెండ్ నాగార్జున డ్యాన్స్ తో ఎంట్రీ ఇచ్చాడు. మొదట ఆడియన్స్ తో మాట్లాడారు. నిన్న హౌస్ లో జరిగిన కొన్ని సంఘటనలు చూపించారు. చరణ్ రోహిత్ నామినేషన్స్ గురించి మాట్లాడుకున్నారు. రోహిత్ సింపతీ కోసం ఏడ్చాడు షాలిని వెళ్లిపోతుందేమో అని మాట్లాడుతూ.
నాగార్జున రాగానే మొదట షాలిని ని కన్ఫెషన్ రూమ్ కి పిలిచారు. నామినేషన్స్ లో షాలిని ఎలాంటి రీజన్స్ లేకుండా నామినేట్ చేసారు, గ్రూప్ గా ఆడారు అని సెలబ్రిటీలపై చేసిన కామెంట్స్ కి తిట్టి అగ్ని పరీక్ష బ్యాచ్ గ్రూప్ గా నామినేషన్స్ ఎలాంటి రీజన్ లేకపోయినా సెలబ్రిటీలను నామినేట్ చేయండి అని మాట్లాడుకున్న వీడియో చూపించారు. నామినేషన్స్ గురించి డిస్కషన్స్ వద్దని చెప్పినా ఎందుకు మాట్లాడవు అని తిట్టారు. అసలు మీరు గ్రూప్ గా ఆడారు వాళ్ళు కాదు అని తిట్టారు నాగార్జున. నాగార్జున స్వయంగా అగ్నిపరీక్ష బ్యాచ్ గ్రూపిజం ని బయటపెట్టేసారు. అయినా షాలిని సపోర్ట్ చేసుకోవాలని చూడటంతో తిట్టారు. కన్ఫెషన్ రూమ్ లో మాట్లాడింది ఎవరికీ చెప్పకూడదు అన్నాడు నాగ్.
తర్వాత అపూర్వని అరుపూర్వ అని పిలిచి ఎందుకు అరుస్తున్నావు అన్నిటికి అని తిట్టారు. గేమ్ ఆడినా గేమ్ లో కూడా కిందకు పడిపోయావు. గేమ్ లో సరిగ్గా ఆడకపోయినా ఆడాను అని సంచాలక్ లతో గొడవ పెట్టుకున్న వీడియో చూపించాడు. అలాగే రామ్ ప్రసాద్ FIR అని అన్న మాటని అఫైర్ అని అర్ధం చేసుకున్న దానికి తిట్టాడు. అన్ని ఊహించుకుంటావు, గత వారం ఇదే చెప్పినా మారలేదు అని తిట్టారు. అరుపూర్వ హౌస్ లో ఉన్న అందరికి సారి చెప్పాలి అరుస్తున్నందుకు అని అన్నారు నాగార్జున. దీంతో అపూర్వ అందరికి సారి చెప్పింది. త్రిగున్ ని అపూర్వ ని పొగుడుతూ పాట పాడమన్నాడు నాగార్జున సరదాగా. కానీ తిట్టినట్టు పాడాడు. చరణ్, రామ్ ప్రసాద్, నరేష్, రోహిత్ లతో కూడా పొగిడించాడు అపూర్వని.
Also Read : Jabardasth Babu : దర్శకుడిగా మారిన మరో జబర్దస్త్ కమెడియన్.. వెబ్ సిరీస్‌తో..
అమన్.. ని మొదట పొగిడారు నాగ్ బాగా ఆడినందుకు. అయితే ముకేశ్ ని బూతు తిట్టిన వీడియో చూపించి తిట్టారు.
వర్షిణి.. అపూర్వ ని వర్షిణి కెప్టెన్సీ గురించి చెప్పమంటే కంప్లైంట్స్ చెప్పింది. రోహిత్, షాలిని బాత్రూమ్స్ కడగలేదు, వర్షిణి అందర్నీ కంట్రోల్ చేయలేదు అని చెప్పింది. నాగార్జున షాలిని, రోహిత్ లకు కౌంటర్ ఇచ్చాడు. వర్షిణి మంచిగా ఉంటే సరిపోదు. రోహిత్, షాలిని కి పర్మిషన్ ఇవ్వలేదు. స్ట్రిక్ట్ గా ఉండాలి కెప్టెన్ అంటే అని చెప్పాడు. అలాగే అపూర్వను గత వారం డిజాస్టర్ కెప్టెన్ అని నాగార్జున తిట్టిన సంగతి తెలిసిందే. దాంతో కెప్టెన్ గా అపూర్వకు 30 మార్కులు, వర్షిణికి 65 మార్కులు ఇచ్చారు నాగార్జున.
ఝాన్సీని పల్లెటూరు నుంచి వచ్చినవాళ్లు స్వచ్ఛంగా ఉంటారు, కానీ నువ్వు మోసం చేసావు ఎందుకు. నువ్వు మంచి దానివి అనుకున్నాను కానీ కాదు, మోసం చేస్తావు అని డ్రాయింగ్ గేమ్ లో తాను సీక్రెట్ గా ముకేశ్ కి హింట్స్ ఇచ్చిన వీడియో చూపించారు నాగ్. దీంతో తప్పు చేశాను అంటూ ఝాన్సీ ఎమోషనల్ అయింది.
నరేష్ ని బాగా ఆడుతున్నావు అని అభినందించి. గేమ్ లో సరిగా గీయనందుకు సరదాగా తిట్టారు. రోహిత్ నరేష్ ని నామినేషన్ లో పెట్టినందుకు రోహిత్ కే కౌంటర్ వేశారు నాగార్జున.
రామ్ ప్రసాద్.. అపూర్వ సరదాగా పెళ్ళికి అబ్బాయి చూడమన్న మాటకి రామ్ ప్రసాద్ కూడా సరదాగా అన్నా అపూర్వ సీరియస్ అయిన సంఘటన గుర్తుచేసి అపూర్వకు కౌంటర్ ఇచ్చాడు నాగార్జున. షాలిని అపూర్వకు వ్యతిరేకంగా మాట్లాడింది ఈ విషయంలో. షాలిని – అపూర్వ – రోహిత్ గొడవలో జనాల్ని తీసుకురావొద్దు. మీరే కూర్చొని మీరే సాల్వ్ చేసుకోండి అని కౌంటర్ ఇచ్చారు నాగ్. రామ్ ప్రసాద్ ని పంచ్ లు జాగ్రత్తగా చూసి వేయమన్నారు.
చరణ్.. ఆడట్లేదని మరోసారి తిట్టారు. ఫ్లర్టింగ్ చేస్తున్నందుకు కౌంటర్లు వేసాడు నాగ్.
అనంతరం నెక్స్ట్ వారం వైల్డ్ కార్డు క్యాండిడేట్స్ వస్తారు అని చెప్పారు నాగార్జున. అలాగే హౌస్ లో ఉన్నవాళ్లలో ఎవరు ఉండటానికి అర్హత లేదో కారణాలు చెప్పి వాళ్ళ ఫేస్ మీద ఇంటూ మార్క్ స్టాంప్ వేయాలి అనే టాస్క్ ఇచ్చారు.
దేబ్జానీ – రోహిత్ కి ఇంట్లో ఉండే అర్హత లేదు అని తన కారణాలు చెప్పి అతని ఫేస్ పై ఇంటూ మార్క్ వేసింది. అపూర్వ – త్రిగున్ కి ఇంట్లో ఉండే అర్హత లేదు అని తన కారణాలు చెప్పి అతని ఫేస్ పై ఇంటూ మార్క్ వేసింది. ముకేశ్ – రోహిత్ కి ఇంట్లో ఉండే అర్హత లేదు అని తన కారణాలు చెప్పి అతని ఫేస్ పై ఇంటూ మార్క్ వేసాడు. వంశీ కూడా రోహిత్ కి ఇంట్లో ఉండే అర్హత లేదు అని తన కారణాలు చెప్పి అతని ఫేస్ పై ఇంటూ మార్క్ వేసాడు. షాలిని – దేబ్జానీ కి ఇంట్లో ఉండే అర్హత లేదు అని తన కారణాలు చెప్పి ఆమె ఫేస్ పై ఇంటూ మార్క్ వేసింది. అయితే షాలిని చెప్పిన రీజన్స్ కి నాగార్జున తనకే కౌంటర్ కే ఇచ్చాడు. షాలిని అపూర్వ ని చీప్ అన్న వీడియో చూపించి తిట్టాడు నాగార్జున . వరుసగా షాలిని చెప్పిన కారణాలు అన్నిటికి కౌంటర్లు ఇచ్చాడు నాగ్. దీంతో షాలిని సైలెంట్ అయిపొయింది. చరణ్ – ముకేశ్ కి ఇంట్లో ఉండే అర్హత లేదు అని తన కారణాలు చెప్పి అతని ఫేస్ పై ఇంటూ మార్క్ వేసాడు. రామ్ ప్రసాద్ – చరణ్ రీ ఎంట్రీ ఇచ్చినా ఆడట్లేదు అని అతని ఫేస్ పై ఇంటూ మార్క్ వేసాడు. రామ్ ప్రసాద్ చెప్పిన దానికి నాగార్జున కూడా అతను ఆడడు అని చరణ్ కి కౌంటర్ ఇచ్చాడు. అతను ఆడితే నాకు, జనాలకు కూడా చూడాలని ఉంది కానీ అతను ఆడడు అని చరణ్ పై కౌంటర్లు వేశారు నాగ్. అమన్ – వర్షిణి ఇంట్లో ఉండే అర్హత లేదు అని తన కారణాలు చెప్పి ఆమె ఫేస్ పై ఇంటూ మార్క్ వేసాడు. ఝాన్సీ కూడా చరణ్ కి ఇంట్లో ఉండే అర్హత లేదు అని తన కారణాలు చెప్పి అతని ఫేస్ పై ఇంటూ మార్క్ వేసింది. రోహిత్ – వంశీ ఇంట్లో ఉండే అర్హత లేదు అని తన కారణాలు చెప్పి అతని ఫేస్ పై ఇంటూ మార్క్ వేసాడు.
నాగార్జున వంశీ తో నువ్వు సరిగ్గా ఆడట్లేదు, ఆడు అని చెప్పాడు. ఫుడ్ వేస్టేజ్ ఎవరు వేస్ట్ చేస్తే వాళ్లకు డైరెక్ట్ గా చెప్పు అని చెప్పాడు. షాలిని, రోహిత్ ఫుడ్ వేస్ట్ చేసినందుకు నాగార్జున తిట్టారు. సుధీర్- రోహిత్ ఫేస్ పై స్టాంప్ వేసాడు. నాగార్జున సుధీర్ కెప్టెన్ అయినందుకు అభినందించి గేమ్స్ బాగా ఆడవు, బాగా మాట్లాడుతున్నావు అన్నాడు. రోహిత్ కి మరోసారి మేలుకో రాజా అని కౌంటర్ ఇచ్చాడు నాగ్.
నరేష్ కూడా చరణ్ ఆడట్లేదని అతని ఫేస్ పై మార్క్ పెట్టాడు. త్రిగున్ – అపూర్వ ఫేస్ పై మార్క్ పెట్టాడు. అపూర్వ ఫ్యామిలీని తిట్టిందని త్రిగున్ చెప్పిన కారణాలకు అపూర్వ కౌంటర్లు వేయడానికి చూసింది కానీ నాగార్జున అపూర్వదే తప్పు అని అందరితో మాట్లాడించి చెప్పాడు. దీంతో అపూర్వ సింపతీ కోసం ఏడ్చి నాదే తప్పు ఇంకా వదిలేయండి ఈ టాపిక్ అని నాగార్జున మీదే ఫైర్ అయింది. త్రిగున్ తన సింపతీ ఏడ్పుని బయటపెట్టాడు. కానీ నాగార్జున అలా అనొద్దు అని త్రిగున్ ని తిట్టాడు. ఈ విషయంలో ఫ్యామిలీని అన్నందుకు త్రిగున్ కూడా ఎమోషనల్ అయ్యాడు.
వర్షిణి కూడా రోహిత్ కి అర్హత లేదు అని ఫేస్ పై మార్క్ వేసింది. రోహిత్ కి ఎక్కువగా 5 ఓట్లు వచ్చాయి. నాగార్జున దీని గురించి అడిగితే త్రిగున్ ఇన్ని పనులు చేసినా నాకు ఎలా వేస్తారు ఓట్లు అని అన్నాడు. దానికి నాగార్జున కౌంటర్ ఇచ్చాడు. నీకు నువ్వు ఎన్ని మార్కులు వేసుకుంటావు గేమ్స్ కి అంటే చాలా వాటికి 9 అని చెప్పాడు రోహిత్. ఎలా వేసుకుంటావు ఏమి ఆడకుండా అని తిట్టారు నాగ్. షాలినితో ముచ్చట్లు పెట్టే దానికి బిగ్ బాస్ చెప్పినా మారట్లేదు అని తిట్టారు. షాలిని వల్ల గేమ్ డౌన్ అయింది అని ఆడియన్స్ చెప్పిన మాటలు రోహిత్ కి చూపించారు నాగ్.
అనంతరం నాగార్జున వెళ్ళిపోయాక షాలిని ఆడియన్స్ చెప్పింది తప్పు అని ఏడ్చింది రోహిత్ దగ్గర. మళ్ళీ సింపతీ కోసం ట్రై చేసింది. షాలిని.. నీకు అడ్డు రాను, నువ్వు ఆడు అని చెప్పింది. అయినా రోహిత్ ఏం మారకుండా నీ వల్లే నేను రీఫ్రెష్ అవుతున్నాను. నీతో హ్యాపీగా ఉంటాను అని చెప్పుకొచ్చాడు. వంశీ – త్రిగున్ అపూర్వ ఇష్యూ గురించి మాట్లాడుకున్నారు. కెప్టెన్ అయిన వాళ్లకు ఇచ్చే గోల్డ్ కాయిన్స్ సుధీర్ కి ఇవ్వడంతో రెండిట్లో ఒకటి వంశీ కి, ఇంకొకటి దేబ్జానీకి ఇచ్చాడు. షాలిని వల్ల రోహిత్ ఆట పోతుందనే దాని గురించి రామ్ ప్రసాద్, నరేష్ దగ్గర సరదాగా డిస్కషన్ పెట్టారు. చివర్లో రేపు వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ వస్తారని నాగార్జున ప్రకటించారు.
మొత్తానికి ఇవాళ ఎపిసోడ్ లో నాగార్జున అగ్నిపరీక్ష బ్యాచ్ చేసే గ్రూపిజం, ఓవర్ యాక్షన్ బయటపెట్టి వాళ్లకు షాక్ ఇచ్చారు. మరి వాళ్ళు ఇప్పటికైనా మారతారో లేదో చూడాలి. ఇక రేపు ఇద్దరు ఎలిమినేట్ అవుతారని సమాచారం.
