Devendra Fadnavis emotion
Deputy CM Devendra Fadnavis : ‘‘ఓ సోదరి కాలి బొటనివేలు నా నుదిటి తిలకం దిద్దింది..జీవితంలో ఇటువంటి క్షణాలు’’అంటూ మహారాష్ట్ర (Maharashtra) ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ( Deputy Chief Minister Devendra Fadnavis)భావోద్వేగానికి గురవుతు ట్వీట్ చేశారు. రాష్ట్రంలోని జలగావ్ (Jalgaon)ప్రాతంలో దీప్ స్తంభ ఫౌండేషన్ (Deepstambh Foundation) నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఉండే వికలాంగులతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా రెండు చేతులు లేని ఓ వికలాంగ బాలిక ఫడ్నవీస్ కు తన కాలి బొటనవేలితో బొట్టుపెట్టింది.దీంతో ఫడ్నవీస్ భావోద్వేగానికి గురయ్యారు. ఆ బాలికకు చేతులెత్తి నమస్కరించారు. వికలాంగ బాలిక తన కాలితో ఆయనకు బొట్టు పెట్టిన ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేస్తు భావోద్వేగానికి గురి అయ్యారు.
‘‘ఇప్పటి వరకు ఎందరో తల్లులు, సోదరీమణుల నుంచి నేను ఆశీర్వాదం తీసుకున్నాను. తిలకం స్వీకరించాను. కానీ ఇప్పుడు నాకు తిలకం దిద్దేందుకు ఓ సోదరి బొటనవేలు నా నుదిటిమీదకు చేరింది. అది చేయి బొటనివేలు కాదు కాలి బొటనవేలు.జీవితంలో ఎదురయ్యే ఇలాంటి క్షణాలు ఒక్కసారిగా ఉద్వేగానికి గురి చేస్తాయి. కళ్లు చెమర్చేలాచేస్తాయి. ఆ సోదరి నాకు బొట్టు పెట్టి అదే కాళ్లతో హారితి కూడా ఇచ్చింది.అప్పుడు ఆ సోదరి మొహంలో చిరునవ్వు, కళ్లల్లో ఒకరకమైన మెరుపు కనిపించింది. ‘ ఆ మెరుపు చూస్తే నాకు ఏమనిపించిందంటే..‘‘నాకు ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే..నాకుఎవరి జాలి, దయ అవసరం లేదు..ఆ పరిస్థితులను దాటుకుని వెళ్తాను’అని దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు.
आज तक कई माताओं-बहनों ने आशीर्वाद स्वरूपी आरती की, तिलक लगाया।
आज भी उसी भावना के साथ एक अंगूठा मेरे माथे पर तिलक लगाने के लिए पहुंचा… पर इस बार ये हाथ का नहीं पांव का अंगूठा था।
जीवन में आने वाले ऐसे क्षण झकझोर देते हैं, आँखों को नम कर देते हैं, पर सिर्फ कुछ पल के लिए।… pic.twitter.com/pqpqeO3Kbo— Devendra Fadnavis (@Dev_Fadnavis) June 27, 2023