Maharashtra
Maharashtra: మహారాష్ట్రకు చెందిన ఇండిపెండెంట్ ఎంపీ నవనీత్ కౌర్ రానాకు బాంబే హైకోర్టు రూ.2లక్షల ఫైన్ విధించింది. ఫేక్ క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్ మిట్ చేసిందనే ఆరోపణలపై జరిగిన విచారణకు ఈ జరిమానా కట్టాల్సి వచ్చింది. అమరావతి నియోజకవర్గం నుంచి తొలిసారి ఎంపీ అయిన నవనీత్.. ప్రస్తుతం సీట్ కోల్పోయే పరిస్థితిలో ఉంది.
మహారాష్ట్రలోని ఎనిమిది మంది మహిళా శాసన సభ్యుల్లో ఒకరైన కౌర్ (35)ఏడు భాషల్లో మాట్లాడగలరు. శివసేన లీడర్, మాజీ ఎంపీ ఆనంద్ రావ్ అద్సుల్ ఆమెకు విసిరిన ఛాలెంజ్ ఇంతవరకూ దారి తీసింది.
మార్చి నెలలో శివసేన ఎంపీ, అరవింద్ శావంత్ లోక్ సభలో జైలుకు పంపిస్తానంటూ ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాకుండా తనపై యాసిడ్ అటాక్ చేస్తామంటూ.. ఫోన్ కాల్స్, శివ సేన లెటర్ హెడ్స్ పై హెచ్చరికలు అందాయంటూ స్పీకర్ కు కంప్లైంట్ చేశారు నవనీత్.