కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో మరాఠీ తప్పనిసరి చేసిన మహారాష్ట్ర

మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో మరాఠీ భాషను కంపల్సరీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సర్క్యూలర్ ద్వారా దీనిని వెల్లడించింది. సీఎం ఉద్ధవ్ ఠాకరే.. అన్ని శాఖలకు మరాఠీ భాషను అధికారిక భాషగా ప్రకటిస్తూ ప్రభుత్వ కార్యాలయాలకు మెసేజ్ పంపారు.

డిపార్ట్‌మెంట్ల మధ్య కమ్యూనికేషన్ కోసం వాడుకుంటూ మరాఠీ భాషలోనే ప్రెస్ నోట్‌లు వంటివి పంపాలని ఆదేశించారు. ఈ ఆదేశాలకు వ్యతిరేకంగా అధికారులు ప్రవర్తించ వద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఈ నోటీస్ ను పట్టించుకోకుండా యథేచ్ఛగా ప్రవర్తిస్తే ఇంక్రిమెంట్‌లు క్యాన్సిల్ అవుతాయని, వారిపై కాన్ఫిడెన్షియల్ సర్వీస్ బుక్‌లో నెగెటివ్ రిమార్క్స్ ఫైల్ చేస్తామని అన్నారు.



గత నెలలో Amazon, Flipkart యాప్ లను కూడా రాజ్ థాకరే ఆధ్వర్యంలో ఉన్న మహారాష్ట్ర నవనిర్మాణ సేన హెచ్చరించింది. వారి యాప్‌లలో ప్రిఫర్‌డ్ భాషగా మరాఠీ ఉండాలని ఆదేశించింది. ఎమ్ఎన్ఎస్ లీడర్ అఖిల్ ఛిత్రె అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అధికారులకు లెటర్లు సమర్పించి విషయాన్ని తెలియజేశారు.

మరాఠీ భాషను పక్కకు పెడితే ఒప్పుకొనేది లేదని ఎమ్ఎన్ఎస్ చెప్పింది. ప్రిఫర్‌డ్ లాంగ్వేజిగా మరాఠీని పొందపరచని ఈ కామర్స్ కంపెనీలు క్షమాపణ చెప్పాలని అన్నారు.