Delta plus: డెల్టా ప్లస్ ఎఫెక్ట్.. మళ్లీ అమల్లోకి కఠిన నిబంధనలు

కోవిడ్ -19 మహమ్మారి మూడవ వేవ్‌కు కారణమైన డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు పెరుగుతూ ఉండడంతో మహారాష్ట్రలో చాలా జిల్లాల్లో ఆంక్షలను సడలించిన ఒక నెల కన్నా తక్కువ వ్యవధిలోనే మళ్లీ చర్యలను చేపట్టింది.

Delta, Delta plus: కోవిడ్ -19 మహమ్మారి మూడవ వేవ్‌కు కారణమైన డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు పెరుగుతూ ఉండడంతో మహారాష్ట్రలో చాలా జిల్లాల్లో ఆంక్షలను సడలించిన ఒక నెల కన్నా తక్కువ వ్యవధిలోనే మళ్లీ చర్యలను చేపట్టింది. కోవిడ్ తీవ్రత ఎక్కువయ్యే అవకాశం ఉందంటూ నిపుణుల హెచ్చరించగా.. కేసులు తగ్గినా.. సడలింపులు చేయట్లేదంటూ ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా డెల్టా ప్లస్‌ వేరియంట్‌ తొలి మరణం ఇప్పటికే నమోదైంది.

ఇప్పటికే రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌పై మరింత దృష్టి సారించి, సాధ్యమైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ వెయ్యాలని, కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే నిబంధనలు మరింత కఠినతరం చేయాలని నిర్ణయించింది. లేటెస్ట్ మార్గదర్శకాల ప్రకారం.. పుణె, థానేల్లో లెవల్‌ 3 నిబంధనలు అమల్లో ఉంటాయని మహా సర్కారు స్పష్టం చేసింది.

బహిరంగ ప్రదేశాల్లో తిరిగేందుకు సాయంత్రం 4 గంటల వరకే ఈ వెసలుబాటు కల్పించింది. ఆర్టీ- పీసీఆర్‌ పరీక్ష ఫలితాల ఆధారంగానే పాజిటివిటీ రేటును అంచనా వేస్తామని ప్రకటించారు. రాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులతో పనిలేదని, డెల్టా ప్లస్‌ వేరియంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆందోళనకరమైన వేరియంట్‌గా పరిగణిస్తున్నట్లు వెల్లడించారు అధికారులు.

కొత్త మార్గదర్శకాల ప్రకారం, మహారాష్ట్రలోని మాల్స్ మరియు థియేటర్లు మూసివేయబడతాయి, రెస్టారెంట్లు వారాంతపు రోజులలో 50% సామర్థ్యంతో సాయంత్రం 4 గంటల వరకు పనిచేయడానికి అనుమతించబడతాయి. సాయంత్రం 4 గంటలకు జిమ్‌లు, సెలూన్లు, షాపులు మూసివేయాల్సి ఉండగా, వివాహాలకు 50 మందికి మాత్రమే పర్మిషన్ ఇస్తారు.

ట్రెండింగ్ వార్తలు