పోలీసు స్టేషన్‌‌లోనే శివాలయం..ప్రతీరోజు పోలీసుల పూజలు

  • Publish Date - February 21, 2020 / 09:21 AM IST

పోలీసు స్టేషన్‌ ఆవరణలో ఓ దేవాలయాన్ని కట్టారు. సాధారణంగా పోలీస్ స్టేషన్ లో ఎటువంటి దేవాలయాలు ఉండవు. కానీ మధ్యప్రదేశ్‌లోని సంత్‌ హిర్దారామ్‌ నగర్‌ పోలీసు స్టేషన్‌ ఆవరణలో ఓ శివాలయం ఉంది. ఆ ఆలయంలో కొలువైన పరమ శివుడికి పోలీసులు ప్రతి రోజు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. 
 

శుక్రవారం (ఫిబ్రవరి 21,2020)శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆ ఆలయానికి పోలీసులు థానేశ్వర్‌ మహదేవ్‌ మందిర్‌గా నామకరణం చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌ శివపాల్‌ సింగ్‌ కుష్వాహా మాట్లాడుతూ.. పోలీసు స్టేషన్‌ గేట్‌ వద్ద శివాలయం ఉందన్నారు.

ఈ స్టేషన్‌లోని ప్రతి పోలీసు.. శివుడి ఆశీస్సుల కోసం ప్రార్థిస్తారు. అయితే ఈ ఆలయానికి థానేశ్వర్‌ మహదేవ్‌ మందిర్‌గా నామకరణం చేయాలని భక్తులు సూచించడంతో ఆ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కానిస్టేబుల్‌ యోగేంద్ర రాథోర్‌ మాట్లాడుతూ.. ప్రతి మహాశివరాత్రి పర్వదినం రోజున ఇక్కడ  అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు.