Delhi Airport: ఢిల్లీ విమానాశ్ర‌యంలో త‌ప్పిన పెను ప్ర‌మాదం

ఢిల్లీ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. రెండు విమానాలు కొన్ని సెకన్ల తేడాతో పెను‌ ప్రమాదం నుంచి బయటపడ్డాయి.

Vistara Airlines flight

Delhi Airport: ఢిల్లీ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. రెండు విమానాలు కొన్ని సెకన్ల తేడాతో పెను‌ ప్రమాదం నుంచి బయటపడ్డాయి. ఒకేసారి విమానాశ్రయంలో టేకాఫ్‌, ల్యాండింగ్‌కు రెండు విమానాలకు అనుమతి లభించింది. చివరి క్షణంలో టేకాఫ్ నిలిపివేయడంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. రెండు విమానాలు విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందినవే. బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది.

Delhi airport: విమానాశ్రయంలో ఎన్నడూ లేనంత భారీగా పట్టుబడ్డ విదేశీ కరెన్సీ.. ఈ ముగ్గురు కలిసి..

ఢిల్లీ నుంచి బెంగాల్‌లోని బగ్‌దోరాకు వెళ్తున్నవిమానం యూకే725 టేకాఫ్ తీసుకోనుండగా, అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానం ల్యాండింగ్ కావాల్సి ఉంది. ఒకేసారి రెండు విమానాలకు అనుమతి ఇవ్వడంతో రన్‌వేపై ఆ రెండువిమానాలు ఢీకొనే పరిస్థితి ఏర్పడింది. ఏటీసీ అధికారులు అప్రమత్తమై అబార్ట్ సంకేతాలు ఇవ్వడంతో బాగ్ దోరా విమానం రన్ వే నుంచి పార్కింగ్ బేకు వెళ్లిపోయింది. అయితే, ఈ ఘటనపై ఇప్పటి వరకు విస్తారా ఎయిర్ లైన్స్ సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు.