Shashi Tharoor On Congress president: కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే గెలుపుపై శశి థరూర్ స్పందన

శశి థరూర్ స్పందిస్తూ... ‘‘కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు కావడం చాలా గౌరవప్రదమైన విషయం. అతిపెద్ద బాధ్యత ఉంటుంది. ఇందులో ఖర్గే జీ విజయం సాధించాలని నేను కోరుకుంటున్నాను. వేలాది మంది సహచరుల మద్దతు పొందారు. దేశంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేయోభిలాషుల ఆకాంక్షలను నెరవేర్చేలా పనిచేయాలి’’ అని ట్వీట్ చేశారు. అక్టోబరు 17న కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాస్వామ్యం కారణంగా ఓటింగ్ రూపంలో వేడుక జరుపుకున్నామని శశి థరూర్ చెప్పారు.

Shashi Tharoor On Congress president: కాంగ్రెస్ పార్టీ నిజమైన పునరుద్ధరణ నేడు ప్రారంభమైందని ఆ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే 7,897 ఓట్లతో ఏఐసీసీ అధ్యక్షుడిగా గెలుపొందిన విషయం తెలిసిందే.శశి థరూర్ కు 1,072 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ సందర్భంగా శశి థరూర్ స్పందిస్తూ… ‘‘కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు కావడం చాలా గౌరవప్రదమైన విషయం. అతిపెద్ద బాధ్యత ఉంటుంది. ఇందులో ఖర్గే జీ విజయం సాధించాలని నేను కోరుకుంటున్నాను. వేలాది మంది సహచరుల మద్దతు పొందారు. దేశంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేయోభిలాషుల ఆకాంక్షలను నెరవేర్చేలా పనిచేయాలి’’ అని ట్వీట్ చేశారు.

అక్టోబరు 17న కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాస్వామ్యం కారణంగా ఓటింగ్ రూపంలో వేడుక జరుపుకున్నామని శశి థరూర్ చెప్పారు. ఇవాళ మల్లికార్జున ఖర్గేకు అనుకూలంగా తుది తీర్పు వచ్చిందని వ్యాఖ్యానించారు. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నానని ఓ ప్రకటనలో థరూర్ పేర్కొన్నారు.

పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి నేతలకు అవకాశం ఇచ్చిన పార్టీలో సభ్యుడిని అయినందుకు సంతోషంగా ఉందని శశి థరూర్ చెప్పారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో, తటస్థ వైఖరితో ఎన్నికలు జరగనిచ్చిన రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీకి కృతజ్ఞతలు చెబుతున్నానని పేర్కొన్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

ట్రెండింగ్ వార్తలు