Mamata Banerjee : మమత 66 ఏళ్ల ఆంటీ, సువేందు వివాదాస్పద వ్యాఖ్యలు

పశ్చిమబెంగాల్ లో విమర్శలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఒకరిపైనొకరు దూషించుకుంటున్నారు. ఒకరు ఒక మాటంటే..తామేది తక్కువ తినలేదు అంటూ..మరో రెండు మాటలు అంటున్నారు.

66 Year Old Aunty : పశ్చిమబెంగాల్ లో విమర్శలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఒకరిపైనొకరు దూషించుకుంటున్నారు. ఒకరు ఒక మాటంటే..తామేది తక్కువ తినలేదు అంటూ..మరో రెండు మాటలు అంటున్నారు. ప్రధానంగా బీజేపీ – టీఎంసీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. మమతకు ఈసారి చెక్ పెట్టాలని కాషాయ దళం ఉవ్విళ్లూరుతోంది. టీఎంసీకి చెందిన కీలక నేతలు బీజేపీలో చేరిపోయి..సవాల్ విసురుతున్నారు. అందులో సువేందు అధికారి ఒకరు. ఇతను నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా..మమత బెనర్జీ కూడా ఇక్కడి నుంచే పోటీ చేస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. మమత – సువేందు మధ్య విమర్శలతో రాజకీయాలు హీటెక్కాయి.

తాజాగా..సీఎం మమతా బెనర్జీ 66 ఏళ్ల ఆంటీ అని సువేందు అధికారి కామెంట్ చేయడం దుమారం రేపుతోంది. దీదీ వాడుతున్న భాష సరిగ్గా లేదని, ఆమె ఆ భాషను మార్చుకోవాలని హితవు పలికారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై అభ్యంతర రీతిలో భాషను వాడుతున్నారని, దీదీ 66 ఏళ్ల ఆంటీ అంటూ వెల్లడించారు. ఓటర్లను ఆకర్షించేందుకు దీదీ చేస్తున్న ప్రయత్నాలు విఫలమౌతాయని జోస్యం చెప్పారు. ప్రస్తుతం ఎన్నికల్లో ఎక్కడా ఎలాంటి హింస చోటు చేసుకోవద్దని ఆశిస్తున్నట్లు, కేంద్ర బలగాలు మోహరించాయన్నారు. ప్రస్తుతం 14 డ్రోన్లను వాడుతున్నట్లు, 76 బూతుల్లో క్విక్ రెస్పాన్స్ దళాలున్నాయన్నారు. మే 02వ తేదీన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలుబడుతాయని, ఆ తర్వాత.. కూడా కేంద్ర బలగాలు రాష్ట్రంలోనే ఉండాలని సువేందు వెల్లడించారు.

Read More : April Fools : ఏప్రిల్ ఫూల్స్ డే, ఎప్పుడు ప్రారంభమైంది..ఏంటా కథ

ట్రెండింగ్ వార్తలు