April Fools : ఏప్రిల్ ఫూల్స్ డే, ఎప్పుడు ప్రారంభమైంది..ఏంటా కథ

1582 సంవత్సరానికి ముందు.. యూరోప్‌లో మార్చి 25 నుంచి ఏప్రిల్ 1 వరకూ కొత్త సంవత్సరం వేడుకలు జరుగుతుండేవి.

April Fools : ఏప్రిల్ ఫూల్స్ డే, ఎప్పుడు ప్రారంభమైంది..ఏంటా కథ

April Fools’ Day 2021

Happy April Fools’ Day : సంవత్సరంలో 12 నెలలు. జనవరి నుంచి ప్రారంభమై డిసెంబర్ వరకు ఉంటుంది. మరలా కొత్త సంవత్సరం వస్తుంది. అయితే..ఇందులో ఏప్రిల్ నెలకు ప్రాధాన్యత ఉంది. అదే ఏప్రిల్ 01. ఈ రోజును అందరూ ఏప్రిల్ ఫూల్ గా పిలుస్తుంటారు. ఏవేవో గాలి వార్తలు చెబుతారు.. విన్నవారు అవునా అని ఆశ్చర్యం వ్యక్తం చేసే సరికి ఏప్రిల్ ఫూల్ అంటూ గట్టిగా నవ్వుతారుఏప్రిల్ ఫూల్స్ డే లేదా ఆల్ ఫూల్స్ డేగా జరుపుకుంటుంటారు. అసలు ఏప్రిల్ ఫూల్ ఎప్పుడు ప్రారంభమైంది. దీనికి పక్కా ఆధారం ఏమీ లేదని కొంతమంది అంటుంటారు. కొంతమంది అభిప్రాయం ప్రకారం…ఏప్రిల్ ఫూల్ 1582 లో ప్రారంభమైందని అంటుంటారు.

1582 సంవత్సరానికి ముందు.. యూరోప్‌లో మార్చి 25 నుంచి ఏప్రిల్ 1 వరకూ కొత్త సంవత్సరం వేడుకలు జరుగుతుండేవి. 1582 లో జులియన్ క్యాలెండర్ స్థానంలో 13వ పోప్ గ్రేగరీ కొత్త క్యాలెండర్ ను విడుదల చేశారంట. దీని ప్రకారం..న్యూ ఇయర్ జనవరి 01వ తేదీన జరుపుకోవాలని సూచించారు. ఈ సూచనను చాలా దేశాలు తిరస్కరించాయి. ఈ క్యాలెండర్ ను అనుమతించేది లేదని స్పష్టం చేశాయి. కొంతమంది ప్రజలు మాత్రం జనవరి 01న కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకొనే వారు. అంతేగాకుండా..ఏప్రిల్ 01న కొత్త సంవత్సరం అని నమ్మేవారని ఫూల్స్ గా జమకట్టి ఏప్రిల్ ఫూల్స్, ఏప్రిల్ ఫిష్ అని ఏడిపించేవారంట.

దీంతో అప్పటి నుంచి ఏప్రిల్ 01 రాగానే ఫూల్స్ డే అంటుంటారు. యూరోప్ నుంచి ప్రపంచ వ్యాప్తంగా పాకి అలా స్థిర పడిపోయిందంటారు. 1700 ఏప్రిల్ 1 న, ఇంగ్లిష్ చిలిపివాళ్ళు ఒకరిపై ఒకరు ఆచరణాత్మక జోకులు వేసుకోవడం ద్వారా ఏప్రిల్ ఫూల్స్ డే వార్షిక సంప్రదాయం ప్రాచుర్యంలోకి వచ్చినట్లు చెప్తారు. స్కాట్లాండ్‌లో రెండు రోజుల సంప్రదాయంగా జరుపుకుంటారు. వివిధ దేశాల్లో విభిన్న రీతుల్లో ఏప్రిల్‌ ఫూల్స్‌ డే ను జరుపుకుంటూ ఉంటారు. భారతదేశంలో 1964 లో ఏప్రిల్ ఫూల్ అనే చిత్రం నిర్మించారు. ఈ చిత్రంలోని ఒక పాట ‘ఏప్రిల్ ఫూల్ బనా, యునో అంగద్ ఆయా’ అనే పాపులర్ అయ్యింది.

Read More : Financial Changes : సామాన్యులకు ఏప్రిల్ 1 షాక్.. పెరగనున్న ధరలు, పన్ను పోటు.. అమల్లోకి కొత్త ఇన్ కమ్ ట్యాక్స్ రూల్స్