Mamata Banerjee : మమతా బెనర్జీ మా శాంతా క్లాజ్ : బెంగాల్ మంత్రి ఫిర్హాద్ హకీమ్ వ్యాఖ్యలు

క్రిస్మస్ పండుగ నేపథ్యంలో పశ్చిమబెంగాల్ రాష్ట్ర మంత్రి ఫిర్హాద్ హకీమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఏడాది పొడవునా ప్రజలకు అభివృద్ధి పనులను బహుమతులుగా ఇచ్చే శాంతాక్లాజ్‌తో పోల్చారు....

Mamata Banerjee

Mamata Banerjee : క్రిస్మస్ పండుగ నేపథ్యంలో పశ్చిమబెంగాల్ రాష్ట్ర మంత్రి ఫిర్హాద్ హకీమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఏడాది పొడవునా ప్రజలకు అభివృద్ధి పనులను బహుమతులుగా ఇచ్చే శాంతాక్లాజ్‌తో పోల్చారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్ర శాంతాక్లాజ్ అని, ఆమె ఏడాది పొడవునా ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలను బహూకరిస్తారని ఫిర్హాద్ హకీమ్ చెప్పారు. కోల్‌కతాలోని అలెన్ పార్క్‌లో జరిగిన క్రిస్మస్ పండుగ వేడుకల్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాల్గొన్నారు.

ALSO READ : Madhya Pradesh : మధ్యప్రదేశ్ కేబినెట్ విస్తరణ… కొత్తగా 20 మందికి అవకాశం

‘‘మేం చిన్నప్పుడు క్రిస్మస్ పండుగ సందర్భంగా శాంతాక్లాజ్ వస్తారని అనుకునేవాళ్లం.. క్రిస్మస్‌ రోజు ఉదయం బొమ్మలు లేదా చాక్లెట్‌లు బహుమతిగా ఇవ్వడం చూసేవాళ్లం’’ అని హకీమ్ చెప్పారు. మమతాబెనర్జీ పశ్చిమబెంగాల్ కు చెందిన శాంతాక్లాజ్ అని ఆమె అన్నీ రాష్ట్రానికి ఇచ్చిందని హకీమ్ చెప్పారు.

ALSO READ : Telangana : తెలంగాణను వణికిస్తున్న చలిపులి…సంగారెడ్డి జిల్లాలో అత్యల్పంగా 7.4 డిగ్రీల ఉష్ణోగ్రత

‘‘మమతా బెనర్జీ శాంతా, కన్యాశ్రీ పథకం ద్వారా ఆడపిల్లల చదువును కొనసాగించడంలో నిరుపేద తల్లిదండ్రులకు సహాయం చేస్తుంది. తల్లిదండ్రులకు వారి కుమార్తెలకు వివాహం చేయడానికి డబ్బు లేనప్పుడు, కుటుంబానికి సహాయం చేయడానికి ఆమె రూపశ్రీ కార్డుతో ముందుకు వచ్చింది’’ అని మంత్రి హకీమ్ పేర్కొన్నారు.