Mamata Banerjee To Contest From Bhabanipur Seat In Kolkata Sitting Tmc Mla To Resign
Mamata Banerjee పశ్చిమ బెంగాల్ వ్యవసాయశాఖ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత సోభన్దేవ్ చటోపాధ్యాయ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో..కోల్కతా జిల్లాలోని భవానీపుర్ నియోజకవర్గం నుంచి సోభన్దేవ్ చటోపాధ్యాయ 28 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే.
వాస్తవానికి భవానీపుర్ మమతా బెనర్జీ సొంత నియోజకవర్గం. ఎన్నికల ముందు జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆమె ఆ స్థానాన్ని వీడి… నందిగ్రామ్ నుంచి పోటీ చేశారు. నందిగ్రామ్ లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో 1956 ఓట్ల తేడాతో మమత ఓడిపోయారు. అయినా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన మమత…రూల్ ప్రకారం 6 నెలల్లోగా శాసనసభకు లేదా శాసనమండలికి ఎన్నిక కావాల్సి ఉంది. అయితే బెంగాల్ లో శాసనమండలి లేనందున ఆయన ఆరు నెలల్లోగా ఖచ్చితంగా శాసనసభకు ఎన్నికవ్వాల్సి ఉంటుంది.
దీంతో మమత పోటీ చేసేందుకు వీలుగా భవానీపుర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి చటోపాధ్యాయ రాజీనామా చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సీఎం మమతా బెనర్జీ 2011ఉప ఎన్నికల్లో మరియు 2016అసెంబ్లీ ఎన్నికల్లో భవానీపూర్ నుంచి పోటీ చేసి గెలిచారు. కాగా,ఇప్పుడు మరోసారి భవానీపూర్ స్థానం నుంచి మమత పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.