కోల్‌కత్తాలో ఉద్రిక్తత: అమిత్‌షా రోడ్‌షోలో రాళ్లు రువ్వుకున్న టీఎంసీ, బీజేపీ కార్యకర్తలు

  • Publish Date - May 14, 2019 / 02:05 PM IST

పశ్చిమ బెంగాల్ గడ్డ మీద ఫైర్ బ్రాండ్ దీదీ మమతా బెనర్జీ కయ్యానికి కాలుదువ్వారు బీజేపీ చీఫ్ అమిత్ షా రోడ్ షో నిర్వహించేందుకు సమాయత్తం అయ్యారు. హనుమాన్ వేషధారణలో సేవ్ డెమోక్రసీ పేరుతో ర్యాలీ నిర్వహించారు.  జై శ్రీరాం అనే నినాదాలు చేస్తూ ముందుకుసాగుతున్నారు. ఇందుకు సంబంధించి బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తిచేశాయి. రోడ్ షో ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ అమిత్ షా కోసం భారీ వాహనాలను సమకూర్చింది. దానిపై కాషాయ బెల్లూన్లను, బీజేపీ జెండాలను పెట్టింది. అంతేకాదు అమిత్ షా నిర్వహించే రోడ్ షో మార్గంలో 10 వేల బంతిపూల తోరణాలు కట్టారు. దేశంలోని వివిధ కళాబృందాలతో నాట్యం చేయిస్తున్నారు.

ఇదిలా ఉంటే అమిత్ షా ర్యాలీ నిర్వహించే మార్గంలో బీజేపీ జెండాలను టీఎంసీ కార్యకర్తలు తీసివేస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. తృణముల్ గుండాలు, పోలీసులు ఈ పనిచేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే కోల్‌కత్తాలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. అమిత్ షా ర్యాలీలో టీఎంసీ, బీజేపీ కార్యకర్తలు పరస్పర దాడులు చేసుకున్నారు. పులువురికి తీవ్రగాయాలు అవగా ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. జై శ్రీరామ్ నినాదాలు హోరెత్తాయి. లాఠీచార్జ్  చేసిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.