RT-PCR Report: ఆర్టీ-పీసీఆర్ రిపోర్టు అడిగారని రచ్ఛ చేసిన వ్యక్తి అరెస్టు

ముంబైకు చెందిన విస్తారా ఫ్లైట్ లో ప్రయాణించబోయే వ్యక్తిని ఢిల్లీ ఎయిర్ పోర్టులో అరెస్టు చేశారు. మహారాష్ట్రకు వెళ్లాల్సిన ప్రయాణికులు కచ్చితంగా RT-PCR రిపోర్టు తీసుకుని రావాలి.

Delhi Airport

RT-PCR Report: ముంబైకు చెందిన విస్తారా ఫ్లైట్ లో ప్రయాణించబోయే వ్యక్తిని ఢిల్లీ ఎయిర్ పోర్టులో అరెస్టు చేశారు. మహారాష్ట్రకు వెళ్లాల్సిన ప్రయాణికులు కచ్చితంగా RT-PCR రిపోర్టు తీసుకుని రావాలి. ఆ రూల్ పాటించకుండా నెగెటివ్ రిపోర్టు చూపించలేదని ప్రశ్నించిన సిబ్బందితో గొడవకు దిగాడా వ్యక్తి.

దాంతో ఆ ప్రదేశం నుంచి సీఐఎస్ఎఫ్ పర్సనల్ సిబ్బంది అతణ్ని లాక్కొని వెళ్లారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్టాఫ్ నుంచి రిపీటెడ్ కన్సల్టేషన్స్ వచ్చినప్పటికీ ప్యాసింజర్ కంట్రోల్ తప్పాడు. చివరికి సీఐఎస్ఎఫ్ జోక్యం చేసుకుని ఘటన నుంచి అతణ్ని తప్పించారు. ఆ తర్వాత అధికారిక కంప్లైంట్ వచ్చింది.

అతనిపై పలు కేసులు బుక్ చేసి అరెస్టు చేశారు ఢిల్లీ పోలీసులు. బెయిలబుల్ సెక్షన్లపై కేసు నమోదుకావడంతో ప్రస్తుతం బెయిల్ పై విడుదల అయ్యారు. విచారణ నిమిత్తం అతణ్ని కోర్టులో హాజరుకావాల్సిందిగా పోలీసులు ఆదేశించారు.