Petrol
Distributes Free Petrol : పెట్రోల్ ఫ్రీ అనగానే..ఠక్కున పరుగెట్టే పరిస్థితి నెలకొంది. అందుకంటే..రాకెట్ లా ధరలు దూసుకపోతున్నాయి. ప్రతి రోజు ఎంతో కొంత ధరలు పెరుగుతుండడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు హడలిపోతున్నారు. లీటర్ పెట్రోల్ వంద దాటడంతో..ఇతర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ క్రమంలో..ఓ వ్యక్తి పెట్రోల్ ఫ్రీ అనగానే..ఛెంగున గంతేస్తున్నారు వాహనదారులు. అసలు ఎందుకు పెట్రోల్ ఫ్రీగా ఇచ్చారు ? అతను ఎవరు అనేది తెలుసుకుందాం.
Read More : Heavy Rainfall In Kerala : కేరళలో వర్ష బీభత్సం..మునిగిన కార్లు,బస్సులు..5 జిల్లాల్లో రెడ్ అలర్ట్
మధ్యప్రదేశ్.. బేతుల్ జిల్లాకు చెందిన దీపక్ సైనానీకి సోదరి ఉంది. ఈ సోదరికి అక్టోబర్ 09వ తేదీన ఆడపిల్ల పుట్టింది. దీంతో దీపక్ ఫుల్ ఖుష్ అయిపోయాడు. ఇతనికి ఓ పెట్రోల్ బంక్ ఉంది. మేనకోడలు పుట్టిన సందర్భంగా ఏదో ఒకటి చేద్దామని అనుకున్నాడు. వెంటనే మదిలో ఓ ఆలోచన వచ్చింది. పెట్రోల్ ధరలు పెరుగుతున్న క్రమంలో..దీనిని ఫ్రీగా ఇద్దామని అనుకున్నాడు. పెట్రోల్ బంకుకు వచ్చిన కస్టమర్లందరికీ పెట్రోల్, డీజిల్ ఫ్రీ అని ప్రకటించాడు. అక్టోబర్ 13 నుంచి అక్టోబర్ 15వ తేదీ నుంచి దీనిని ప్రారంభించాడు.
Read More :Asaddudin Owaisi : ముస్లింల జనాభా పెరుగుతోందన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలపై ఒవైసీ ఆగ్రహం
ఉదయం 09 గంటల నుంచి 11 గంటల వరకు మరలా సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు 10 శాతం అదనంగా పెట్రోల్ ఉచితం అని ప్రకటించాడు దీపిక్. రూ. 100కు పెట్రోల్ కొన్న కస్టమర్లకు 5 శాతం, 200 నుంచి 500 రూపాయలకు పెట్రోల్ కొనుగోలు చేసిన వారికి 10 శాతం పెట్రోల్ ఫ్రీ అని ప్రకటించాడు. చమురు ధరలు పెరుగుతున్న క్రమంలో..పెట్రోల్, డీజిల్ ఫ్రీగా ప్రకటించి వార్తల్లోకి ఎక్కాడు. ఆడపిల్ల పుడితే..చీత్కరించడం, ఎలా వదిలించుకోవాలనే ఆలోచించే ఈ రోజుల్లో..దీపక్ చేసిన ఈ పనిపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.