Up
man gets wife married to her lover Uttar Pradesh : తనతో సంతోషంగా లేదని తెలుసుకున్న ఆ భర్త..ఆమె ఆనందాన్ని కోరుకుంటాడు..ఆమె ఎవరితో సంతోషంగా ఉంటుందో తెలుసుకుని..ఆ వ్యక్తికే ఇచ్చి వివాహం చేస్తాడు. ఇలాంటివన్నీ సినిమాలో చూస్తుంటాం. కానీ..రియల్ లీఫ్ లో కూడా జరిగింది. తనను పెళ్లి చేసుకున్న భార్య..సంతోషంగా లేదని ఎందుకో..అని ఆరా తీస్తే..అసలు విషయం తెలిసింది. ప్రేమించిన వ్యక్తికే…భార్యనిచ్చి వివాహం చేయించాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది.
Read More : Raja Vikramarka: కార్తికేయకి అండగా నాని.. ట్రైలర్ ముహూర్తం ఫిక్స్!
కాన్పూర్ కు చెందిన కోమల్, పంకజ్ కు ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. కానీ..పెళ్లి అయినప్పటి నుంచి భర్త కోమల్ తో అయిష్టంగానే ఉంటూ వస్తోంది. అసలు సమస్య ఏంటో అర్థం కాలేదు పంకజ్ కు. భార్య తనతో ఎందుకు ఇష్టంగా ఉండడం లేదు, ఆనందంగా ఎందుకు లేదు అనే దానిపై ఆలోచించసాగాడు. ఆరా తీయగా..అసలు విషయం తెలిసింది. ఇదే విషయాన్ని భార్యకు చెప్పాడు. నీ సంతోషం కోసం ఏదైనా చేస్తా..అసలు విషయం చెప్పాలని సూచించాడు. అప్పుడు చెప్పింది. పెళ్లి కాకముందు..పింటు అనే వ్యక్తితో ప్రేమిస్తున్నట్లు, తామిద్దరం ప్రేమించుకుంటున్నామని తెలిపింది.
Read More : MLC Elections : తెలుగురాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
తన ప్రేమ వివాహానికి కుటుంబసభ్యులు అంగీకరించలేదని, దీంతో ఈ వివాహం చేసుకోవడం జరిగిందని వివరించింది. ఇదంతా విన్న పంకజ్ ఏ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేయలేదు. ప్రశాంతంగా ఆలోచించి..ఇచ్చిన మాట ప్రకారం…నువ్వు ఆనందంగా ఉండాలన్నదే తన కోరిక..అని చెప్పాడు. భార్య వివాహానికి ఏర్పాట్లు చేశాడు. ఈ విషయం స్థానికంగా…చర్చనీయాంశమైంది. ఇరు కుటుంబాలను పిలిచి మాట్లాడాడు. వారికి నచ్చచెప్పి..సంప్రదాయబద్ధంగా..భార్యను పింటూకు ఇచ్చి పెళ్లి జరిపించాడు. భర్తే పెళ్లి పెద్దగా మారి..భార్యను ప్రేమించిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి జరిపించడం హాట్ టాపిక్ అయ్యింది.