MLC Elections : తెలుగురాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల హడావిడి ముగియగానే తెలుగురాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది.

MLC Elections : తెలుగురాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Mlc Elections

MLC Election schedule released : తెలుగురాష్ట్రాల్లో మరో ఎన్నికలు రానున్నాయి. హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల హడావిడి ముగియగానే తెలుగురాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది.

ఏపీలో 3, తెలంగాణలో 6 స్థానాలకు షెడ్యూల్ విడుదలయింది. నవంబర్ 29న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈసీ నవంబర్ 9న నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

Badwel : బద్వేల్‌ ఉప ఎన్నికలో 68.37శాతం ఓటింగ్‌

తెలుగు రాష్ట్రాల్లోని బద్వేల్, హుజూరాబాద్ లలో 2021, అక్టోబర్ 30వ తేదీ శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 7 గంటలకు ముగిసింది. అప్పటి వరకు క్యూ లైన్ లలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అనుమతించారు. పలు చోట్ల ఉద్రిక్తతల మధ్యే పోలింగ్ కొనసాగినా… ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు.

హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోలింగ్ శాతం భారీగా నమోదైంది. బద్వేల్ లో మాత్రం మందకొడిగా నమోదైందని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఎన్నికల ప్రచారంతో అదరగొట్టిన నేతల భవితవ్యం ఇప్పుడు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఎవరు గెలిచారనేది మాత్రం సస్పెన్స్ గా మారింది.