Badwel : బద్వేల్‌ ఉప ఎన్నికలో 68.37శాతం ఓటింగ్‌

ఏపీలోని బద్వేల్‌ నియోజకవర్గ ఉప ఎన్నికలో 68.37శాతం ఓటింగ్‌ నమోదైంది. అయితే గత ఎన్నికల్లో కంటే ఈ సారి 8.25శాతం తక్కువ నమోదైంది. మంగళవారం ఓట్లను లెక్కించి విజేతను ప్రకటించారు.

Badwel : బద్వేల్‌ ఉప ఎన్నికలో 68.37శాతం ఓటింగ్‌

Badvel (2)

Badwel by-election : ఏపీలోని బద్వేల్‌ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో 68.37శాతం ఓటింగ్‌ నమోదైంది. అయితే గత ఎన్నికల్లో కంటే ఈ సారి 8.25శాతం తక్కువ నమోదైంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 77.68శాతం ఓటింగ్ నమోదవ్వగా.. ఈసారి ఓటర్లు మొగ్గు చూపలేదు. నియోజకపరిధిలోని ఈవీఎంలు, వీవీప్యాట్‌లను బాలయోగి గురుకుల పాఠశాలకు తరలించారు.

మంగళవారం ఓట్లను లెక్కించి విజేతను ప్రకటించనున్నారు. బద్వేల్‌లో ప్రధాన పోటీ వైసీపీ, బీజేపీ మధ్యే నెలకొంది. కచ్చితంగా వైసీపీనే గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ.. లక్ష మెజారిటీ పైనే అనుమానాలు తలెత్తుతున్నాయి. వైసీపీ నేతలంతా లక్షకు పైగా మెజారిటీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Huzurabad : హుజూరాబాద్‌ లో గెలుపెవరిది..?

నిన్న ఉదయం మొదట్లో మండకొడిగా సాగిన పోలింగ్ మధ్యాహ్నం తర్వాత ఊపందుకుంది. సాయంత్రం నాలుగు గంటల నుంచి మహిళలు అధిక సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. దీంతో పోలింగ్ శాతం కాస్త పెరిగింది. ఉపపోరులో మహిళలే విజేతలను నిర్ణయిస్తారనేది కూడా నిర్ధారణ అయిపోయింది. అటు చెదురుమదురు ఘటనలు తప్ప పోలింగ్‌ ప్రశాంతగా సాగింది.

అట్లూరు మండలం ఎస్‌.వెంకటాపురంలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఓటేసేందుకు ఎస్‌.వెంకటాపురం పోలింగ్ కేంద్రానికి కొంతమంది స్థానికేతరులు వచ్చారంటూ వారిని.. స్థానికులు నిలదీశారు. దీంతో వాగ్వాదం జరిగింది. ఇరువర్గాలు దాడికి ప్రయత్నించడంతో కాసేపు టెన్షన్ నెలకొంది.